Thaman: బడా ఆఫర్స్ వచ్చినా టెంప్ట్ అవ్వని తమన్.. టార్గెట్ అంటే ఇలా ఉండాలి!

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు నాన్ స్టాప్ గానే వస్తూనే ఉంటాయి వస్తాయి. మరికొన్ని సార్లు లాంగ్ టర్మ్ ప్లాన్‌తో మాత్రమే దక్కుతాయి. అయితే రెండింటినీ బాలన్స్ చేయగలిగిన వాళ్లు కొందరే. అందులో సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) ప్రత్యేకం. సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ తాను ఎప్పటి నుంచో డ్రీమ్‌గా పెట్టుకున్న మ్యూజిక్ దిశగానే వెళతానని ముందుగా డెసైడ్ అయ్యాడు. అదే తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. తమన్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

Thaman

అప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలన్నది అతని కోరిక. కానీ అనుకోకుండా బాయ్స్ (Boys) సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. శంకర్ (Shankar) రూపొందించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో తమన్‌కు వరుసగా నటన ఆఫర్లు వచ్చాయి. 7జీ బృందావన కాలనీలో కూడా కీలక పాత్ర కోసం సంప్రదించగా, మరికొన్ని కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే అవేమీ అతన్ని టెంప్ట్ చేయలేకపోయాయి. తన లక్ష్యం సంగీత దర్శకత్వమే అని అప్పటికే డిసైడ్ అయిన తమన్, పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా వాటిని కాదనుకున్నాడు.

ఈ విషయాన్ని శంకర్ కూడా ఒకసారి తమన్‌ను (Thaman) పిలిచి మోటివేట్ చేయడానికి ట్రై చేశారని చెబుతారు. కానీ తమన్ మాత్రం అప్పటికే 25 ఏళ్ల వయసులో తన ప్రొఫెషనల్ దిశను ఫిక్స్ చేసుకున్నాడు. నటన వైపు వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ కావాలనే కల సాకారం కాదని ముందే అర్థం చేసుకున్నాడు. ప్రస్తుతం తమన్ టాలీవుడ్, కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రూల్ చేస్తున్నాడు. అతను చేసిన అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo), అఖండ (Akhanda), భీమ్లా నాయక్ (Bheemla Nayak) వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

వరుసగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్ వైపూ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు. తమన్ చేసిన ఈ స్మార్ట్ డెసిషన్ వల్లే అతను టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. అప్పటి ఆఫర్లకు ఫిదా అయి ఉంటే, టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా ఈ స్థాయికి రావడం కష్టమే. ఇప్పుడు ఇండస్ట్రీలో తమన్‌ను చూసి ఎంతోమంది మోటివేట్ అవుతున్నారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే, అందుకు అంకితమై శ్రమిస్తే, తమన్ (Thaman) లాంటి సక్సెస్ సాధించడం అసాధ్యం కాదని అంటున్నారు.

తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus