Bandla Ganesh: తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!

టాలీవుడ్‌లో నిర్మాతగా, నటుడిగా, రాజకీయవేత్తగా అన్ని రకాల గ్రౌండ్స్ లో నిలబడిన బండ్ల గణేష్ (Bandla Ganesh Babu).. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన మాటలు, వ్యాఖ్యలు ఎప్పుడూ వివాదాస్పదంగా మారడం, మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక విధంగా హైలైట్ కావడం కామన్. అయితే ఈసారి మాత్రం ఆయన వార్తల్లో నిలవడానికి కారణం సినిమా కాదు, రాజకీయం కూడా కాదు.. పాదయాత్ర. సాధారణ పాదయాత్ర కాదిది. హైదరాబాదులోని తన నివాసం నుంచి నేరుగా తిరుమల వరకు పాదయాత్ర చేయాలని గణేష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Bandla Ganesh

ఇది త్రివిధ దశ పూజలా? లేక నూతన ప్రయాణం కోసం సంకల్పమా? అనే చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన నిర్మాతగా సినిమాలు చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ స్టార్ హీరోలంతా ఇతర నిర్మాణ సంస్థలతో సినిమా కమిట్ అవ్వడం వల్ల బండ్ల గణేష్‌కు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. అయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఇదే సమయంలో రాజకీయాల్లోనూ బండ్ల గణేష్ మళ్లీ ముద్ర వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో చేరి ఎన్నో రకాల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా మరో పార్టీలోకి వెళ్లినట్లు టాక్ వచ్చింది. కానీ చివరికి ఏ పార్టీలోనూ ఆయన సరైన స్థానం పొందలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయనకు ఏదో ఒక కీలక పదవి రాబోతోందని ప్రచారం జరుగుతోంది. అందుకే కొత్త ప్రయాణాన్ని తిరుమల వెంకటేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రారంభించాలని బండ్ల గణేష్ భావించినట్లు సమాచారం. ఆయన నడక బలమేంటో తెలియదు గానీ, హైదరాబాదు నుంచి తిరుమల వరకూ దూరం మాత్రం చాలా ఎక్కువ.

కొందరు ఈ యాత్ర వెనుక ఇంకేదైనా రాజకీయ లెక్కలున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మళ్లీ తన సత్తా చాటేందుకు కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారా లేదా వెంకటేశ్వరుడి కృపతో మళ్లీ నిర్మాతగా ఓ భారీ సినిమా అనౌన్స్ చేయాలనుకుంటున్నారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే బండ్ల గణేష్ ఈ యాత్ర పూర్తిగా భక్తిపరమైనదే అని చెబుతున్నారు. గతంలోనూ అనేక మంది సినీ ప్రముఖులు తిరుమలకు పాదయాత్ర చేసిన సందర్భాలున్నాయి. కానీ హైదరాబాద్ నుంచి నేరుగా పాదయాత్ర అంటే నిజంగానే కష్టమే. మరి బండ్ల గణేష్ ఈ యాత్రపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus