Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

‘లెనిన్‌’ సినిమా గురించి కొన్ని నెలల క్రితం ఓ క్రేజీ రూమర్‌ వినిపించింది. ఆ సినిమా మాస్‌ థీమ్‌లో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉంటుందని.. ఆ పాటకు థియేటర్లు ఊగిపోతాయి అని చెప్పుకొచ్చారు. ఆ పాటలో అఖిల్‌తో మాస్‌ బీట్‌కి స్టెప్పులేయడానికి ఓ స్టార్‌ హీరోయిన్‌ కోసం చూస్తున్నారు అని కూడా చెప్పారు. అయితే సినిమా విడుదల దగ్గరకు వచ్చేసినా ఆ పాట లిరికల్‌ వీడియో బయటకు రాలేదు. దీంతో సినిమాలో చూపించడానికి దాచారేమో అనుకున్నారు. చూస్తే థియేటర్లలోనూ కనిపించలేదు.

Thaman

ఆ పాట ఏమైంది, ఆ పాట వెనుక ఏం జరిగింది అనే వివరాలను సినిమా సంగీత దర్శకుడు తమన్‌ రీసెంట్‌గా చెప్పుకొచ్చారు. ‘లెనిన్‌’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌ ప్లాన్‌ చేశామని, అయితే చివరి నిమిషంలో తీసేయాల్సి వచ్చిందని తమన్ చెప్పి షాకిచ్చారు. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కంపోజ్‌ చేశా. పాట షూటింగ్‌ ప్రారంభిద్దామనుకునే టైమ్‌కి కథకు ఐటెం సాంగ్‌ సెట్‌ కాదని అన్నారు. దీంతో ఆ ఆలోచన అక్కడితో ఆగిపోయింది అని చెప్పారు తమన్‌.

టీమ్‌ అలా చేయడంతో తనకు కోపం వచ్చిందని, ఆ బాధలో సినిమాకు టీమ్‌కి చెందిన నాలుగైదు వాట్సప్‌ గ్రూప్స్‌ నుండి బయటకు కూడా వచ్చేశానని చెప్పారు. ఆ పాట రాయలసీమ యాసలో ఉంటుందని, హిట్‌ అవుతుందనుకున్నానని చెప్పారు. అంతేకాదు ఆ పాట కోసం కోసం రష్మిక మందన, పూజా హెగ్డే, కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ లాంటి నాయికల పేర్లు కూడా చర్చలోకి వచ్చాయని చెప్పారు. కానీ ఆ పాట పెడితే సినిమా కథ మారిపోతుందని, నెగెటివ్‌ రివ్యూలు రాస్తారని తీసేశారని చెప్పారు తమన్‌.

తన రాబోయే సినిమాల గురించి కూడా తమన్‌ ఇదే ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. చిరంజీవి – బాబీ సినిమా షూటింగ్‌ 40 శాతం అయిందట. సంక్రాంతికి సినిమా రావొచ్చు. ఈ సినిమా ‘ఓజీ’కి డబుల్‌ ఉంటుంది. ఆగస్టు 22న ఓ స్పెషల్‌ వీడియో వస్తుంది అందరికీ నచ్చేస్తుందని చెప్పారు. ఇక బాలకృష – గోపీచంద్‌ మలినేని సినిమా గురించి చెబుతూ .. సినిమాలో కొత్త బాలకృష్ణను చూస్తారు. టైటిల్‌ క్రేజీగా ఉంటుందన్నారు. ఈ సినిమాకు ‘కార్పంటర్‌’ అనే పేరును పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.

‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus