Thaman: సితార ఎంట్రీ వెనుక ఇంత కథ నడిచిందా?

  • May 2, 2022 / 10:42 PM IST

సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూడటానికి సితార కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పెన్నీ సాంగ్ లో సితార కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో సితార ఎంట్రీ వెనుక ఎన్నో ఆసక్తికర మలుపులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. పెన్నీ సాంగ్ లో సితార ఎంట్రీ క్రెడిట్ తనకే దక్కుతుందని థమన్ చెప్పుకొచ్చారు.

సితారలో ఎంతో గ్రేస్ ఉందని తాను సితార ఇన్ స్టాగ్రామ్ వీడియోస్ చూస్తుంటానని థమన్ తెలిపారు. సితారకు ఉన్న గ్రేస్ వల్ల పెన్నీ సాంగ్ లో తీసుకోవాలని భావిస్తున్నానని సితారతో చెప్పగా సితార కూడా సాంగ్ లో డ్యాన్స్ చేయడానికి ఆసక్తి చూపిందని థమన్ అన్నారు. ఆ తర్వాత తాను, సితార వెళ్లి పెన్నీ సాంగ్ గురించి చెప్పామని మహేష్ బాబు మొదట ఒప్పుకోలేదని థమన్ వెల్లడించారు.

ఆ తర్వాత తాను ప్రజంటేషన్ చూపించానని ప్రజంటేషన్ నచ్చడంతో మహేష్ బాబు అంగీకరించారని థమన్ కామెంట్లు చేశారు. పెన్నీ సాంగ్ లో సితార ఎంట్రీ ఈ విధంగా జరిగిందని థమన్ కామెంట్లు చేశారు. ఆ తర్వాత సాంగ్ లో సితార చాలా యాక్టివ్ గా చేసిందని మధ్యాహ్నం సితార సెట్స్ పైకి వస్తే సాయంత్రం 5 గంటల లోపు సాంగ్ షూటింగ్ పూర్తైందని థమన్ పేర్కొన్నారు. సితార టాలెంట్ ను థమన్ తెగ మెచ్చుకున్నారు.

సితారకు స్టేజ్ ఫియర్ లేదని కెమెరా అంటే కూడా భయం లేదని థమన్ కామెంట్లు చేశారు. సితారకు రాబోయే రోజుల్లో సోలోగా సింగిల్స్ రిలీజ్ చేసే టాలెంట్ ఉందని థమన్ తెలిపారు. మహేష్ సర్కారు వారి పాటతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారనడంలో సందేహం అవసరం లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus