ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకి సంగీతం అందించనున్న థమన్
- April 10, 2017 / 07:15 AM ISTByFilmy Focus
మ్యూజిక్ డైరక్టర్ థమన్ మెగా ఛాన్స్ పట్టేశారు. ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకి సంగీత దర్శకుడి గా ఖరారు అయ్యారు. 1840 లో తెల్లదొరలు ఎదురునిలిచి పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్నిరామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించనున్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి, ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కలిసి ఈ కథకు కమర్షియల్ హంగులు జోడించారు. ఈ స్క్రిప్ట్ కి చిరు ఒకే చెప్పడంతో లాక్ చేశారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి.. మ్యూజిక్ డైరక్టర్ థమన్ తో కలిసి పాటల కంపోజింగ్ లోకి దిగారు.
ఇది కూడా పూర్తి అయిన వెంటనే ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారు. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న చిరు 151 సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ని పరిశీలిస్తున్నారు. హిస్టారికల్ మూవీ కోసం పనిచేయనున్న ఆరిస్టులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















