టాలీవుడ్ నేటి స్టార్స్ లో ఆ రికార్డు ఎన్టీఆర్ దే

  • June 10, 2020 / 07:00 AM IST

ఈ తరం యంగ్ హీరోలలో డ్యూయల్ రోల్ అత్యధిక సార్లు చేసిన హీరో ఎన్టీఆర్ మాత్రమే. కొందరు హీరోలు అసలు ఈ లిస్ట్ లో చేరలేదు. ఎన్టీఆర్ కంటే ముందే హీరోగా వెండితెరకు పరిచమైన మహేష్ ఇంత వరకు డ్యూయల్ రోల్ చేయకపోవడం విశేషం. ఇప్పటివరకు 26 సినిమాలు చేసిన మహేష్ ఒక్క చిత్రంలో కూడా డ్యూయల్ రోల్ చేయలేదు. ఐతే బాలనటుడిగా ఆయన కొన్ని సినిమాలలో డ్యూయల్ రోల్ చేశాడు. ఎన్టీఆర్, మహేష్ కంటే ముందు వెండితెరకు హీరోగా పరిచమైన పవన్ కళ్యాణ్ ఇంత వరకు ఒక్క సినిమాలో మాత్రమే డ్యూయల్ రోల్ లో కనిపించాడు.

జయంతి సి పర్జాన్జీ దర్శకత్వంలో వచ్చిన తీన్ మార్ మూవీలో డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. ప్రభాస్ ఇప్పటి వరకు మూడు సినిమాలలో డ్యూయల్ రోల్స్ చేశాడు. బాహుబలి చిత్రాలతో పాటు బిల్లా సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. ఇక టాలీవుడ్ మరో స్టార్ హీరో అల్లు అర్జున్ అసలు డ్యూయల్ రోల్ లో నటించలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాయక్ మూవీలో డ్యూయల్ రోల్ చేయడం జరిగింది.

ఎన్టీఆర్ మాత్రం ఈ ఫీట్ అనేక సార్లు చేశారు. ఆయన మొదటి డ్యూయల్ రోల్ మూవీ ఆంధ్రావాలా, ఆ తరువాత అదుర్స్ మూవీలో ఆయన డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. శక్తి మూవీలో కూడా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. ఇక జై లవకుశ మూవీలో త్రిపుల్ రోల్ చేయడం జరిగింది. ఈ జెనరేషన్ స్టార్స్ లో ట్రిపుల్ రోల్ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus