Krithi Shetty: ఆ దర్శకుడి ఆశలన్నీ కృతి శెట్టి పైనే..!

‘ఉప్పెన’ అనే ఒకే ఒక్క చిత్రంతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది కృతి శెట్టి. ‘ఉప్పెన’ చిత్రం విజయ్ సేతుపతి కారణంగా తమిళ్ లో కూడా డబ్ అవడంతో అక్కడ కూడా బాగానే కలెక్ట్ చేసింది. దీంతో అక్కడ కూడా కృతికి క్రేజ్ ఏర్పడింది.ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ అమ్మడి డిమాండ్ మామూలుగా లేదు. క్రేజ్ పరంగా చూసుకున్నా.. పారితోషికం పరంగా చూసుకున్నా.. ఈ అమ్మడు టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

అవి పూర్తయ్యే వరకు మరో సినిమాకి కమిట్ అవ్వను అంటూ మొన్నామధ్య ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కృతి శెట్టి కి ఉన్న క్రేజ్ తనకు కూడా కలిసొస్తుందని.. ఓ దర్శకుడు భావిస్తున్నాడట. వివరాల్లోకి వెళితే.. ఎప్పుడు లవ్ స్టోరీలు తెరకెక్కించే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, గతేడాది ‘వి’ అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నేరుగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

పైగా ఇంద్రగంటి విమర్శలు పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి కధానాయిక కావడంతో బిజినెస్ బాగానే జరుగుతుంది.అంతేకాకుండా ఈమె క్రేజ్ కూడా కలిసొచ్చి.. సినిమా కమర్షియల్ సక్సెస్ సాధిస్తే దర్శకుడు ఇంద్రగంటి గట్టెక్కినట్టే..! మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి..!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus