Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?
- November 10, 2026 / 11:26 PM ISTByPhani Kumar
పవర్ స్టార్, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకోవడం పెద్ద చర్చకే దారితీసింది. ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని చెప్పాలి. పవన్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో అన్నా ఎంతో అండగా నిలబడింది. 2 నెలల క్రితం కూడా బాగానే కనిపించారు. ఎవ్వరూ కూడా వీరు విడిపోతారని ఊహించింది లేదు. సడన్ గా అధికారికంగా ఒక లేఖని విడుదల చేసి షాకిచ్చారు.
Pawan Kalyan

అయితే ఈ జంట విడిపోతున్నట్టు ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అందులో మొదటిది, అన్నా కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను అకస్మాత్తుగా డీయాక్టివేట్ చేయడం అని అంటున్నారు. విడాకుల వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే అనవసర చర్చలకు, ట్రోల్స్‌కు దూరంగా ఉండేందుకు ముందుగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.
రెండవది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఆకస్మిక భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ చర్చలు ఇప్పటికే ముగిసిన తరుణంలో జరిగిన ఈ సమావేశం కొంతవరకు అనుమానాలు రేకెత్తించింది. కూటమిలో భాగస్వామిగా ఉన్నందున, తన వ్యక్తిగత జీవితంలోని ఈ అనూహ్య పరిణామాన్ని సీఎంకు వివరించేందుకే పవన్ వెళ్లారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
ఇక మూడవది, సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి అన్నా హాజరు కాలేదు. మేనల్లుడి వేడుకకు పవన్ తన షెడ్యూల్ బిజీ వల్ల వెళ్లలేకపోయారు. కానీ ఒక్కోసారి ఇలాంటి వేడుకలకి అన్నాను పంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి అలా జరగలేదు. సో సాయి తేజ్ ఎంగేజ్మెంట్కు ముందే పవన్- అన్నా విడిపోవాలని నిర్ణయించుకున్నారనే వాదనకు ఇది మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది.
కారణాలు ఏమైనా కావచ్చు.. పవన్ కళ్యాణ్..కి, మెగా ఫ్యామిలీకి, వారి అభిమానులకి ఇది పరీక్ష సమయం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కావచ్చు.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు.. మీడియా ముందుకు వస్తే కనుక ఈ విషయంపై కచ్చితంగా ప్రశ్నలు ఎదురవుతాయి.












