4 లక్షల నుండి 40 కోట్లు…ఎన్టీఆర్ జర్నీ అద్భుతం

టాలీవుడ్ క్రేజీ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ టాప్ స్టార్ ని చేసింది. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్ తన మొదటి సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఎన్టీఆర్, 2001లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో వి ఆర్ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా విడుదలైంది.

ఐతే ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కేవలం 4 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ఆ సినిమా విడుదలయ్యే నాటికి ఎన్టీఆర్ ఇంకా తన టీనేజ్ కూడా కంప్లీట్ చేయలేదు. 4 లక్షలు చాలా పెద్ద మొత్తంగా భావించిన ఎన్టీఆర్ ఆ డబ్బును, ఏమి చేయాలో, ఎక్కడ దాచాలో తెలియక చాలా సతమతమయ్యాడట. చివరికి తన తల్లికి ఆ డబ్బులను ఎన్టీఆర్ గిఫ్ట్ గా ఇచ్చాడట. మొదటి సినిమాకు 4 లక్షల పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్ 2వ చిత్రం నుండి హిట్స్ కొట్టడం మొదలుపెట్టాడు.

ఎన్టీఆర్ 4వ చిత్రం ఆది బ్లాక్ బస్టర్ హిట్, 2003లో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇలా మొదటి చిత్రానికి 4లక్షలు తీసుకున్న ఎన్టీఆర్ కేవలం రెండేళ్లలో టాలీవుడ్ లో భారీ పారితోషికం తీసుకొనే హీరోలలో ఒకరిగా ఎదిగారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ 30 నుండి 40 కోట్ల వరకు ఉంది. 4 లక్షల పారితోషికం నుండి 40 కోట్లకు ఎదిగాడు ఎన్టీఆర్.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus