Prabhas, Maruthi: మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరనున్నారా.. అలాంటి కథ ఎంచుకున్నారా?

  • October 31, 2023 / 09:51 PM IST

సాధారణంగా పెద్ద సినిమాలకు సంబంధించి విడుదలకు ముందు, విడుదల తర్వాత ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతాయి. అయితే ప్రభాస్ మారుతి కాంబో మూవీ మాత్రం పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే షూట్ జరుపుకుంటోంది. ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది. అయితే ప్రభాస్ మారుతి కాంబో మూవీ రజనీకాంత్ భాషా రేంజ్ లో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వైల్డ్ గా ఉంటాయని ప్రభాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఆ సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాతో మారుతి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరడం ఖాయమని మారుతి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమాతో దక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మారుతి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథను ఎంచుకున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ మారుతి కాంబో మూవీకి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని భోగట్టా. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి ఈ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ (Prabhas)  ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటుండగా మారుతి మాత్రం పరిమితంగానే తీసుకుంటున్నారని సమాచారం. ప్రభాస్ మారుతి కాంబో మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదలవుతున్నా విడుదల తర్వాత సంచలనాలు సృష్టించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ప్రభాస్ మారుతి కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus