18 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడ.. ‘ఓజి’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ఓ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను పవన్ కళ్యాణ్ మార్చి 11నే విజయవాడకు బయల్దేరారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన తిరిగి వచ్చిన వెంటనే ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్లో తిరిగి పాల్గొంటారు. ఈ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ముగిసిన వెంటనే..

ఆయన సుజిత్ దర్శకత్వంలో ‘ఓజి'(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. సుజీత్ ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. లొకేషన్స్ వేట కూడా మొదలుపెట్టాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు ముంబైలో జరుగుతుందని సమాచారం. ఇది పక్కా గ్యాంగ్ స్టర్ మూవీ. పాటలు వంటివి ఉండవు అని ఇన్సైడ్. కాబట్టి.. ఒక్కసారి సెట్స్ పైకి వెళ్తే.. తక్కువ రోజుల్లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ చిత్రం షూటింగ్ కూడా ముంబైలో జరిగింది. మళ్ళీ 18 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ మళ్ళీ ముంబైలో జరగబోతున్నట్టు వినికిడి. ఇక ‘ఓజి’ చిత్రాన్ని ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించిన దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నటించబోయే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

‘ఓజి’ మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్… హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్తారు… అటు తర్వాత ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను కూడా పవన్ పూర్తిచేయాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus