Rajamouli: ‘జక్కన్న’ పేరుతో రాజమౌళిని మొదట పిలిచిన నటుడు అతనే..!
- August 13, 2021 / 01:05 PM ISTByFilmy Focus
ఎస్.ఎస్.రాజమౌళి గురించి ప్రత్యేకమైన ఇంట్రో ఏమి ఇవ్వనవసరం లేదు. అతని గురించి అతని సినిమాలే మాట్లాడతాయి. తెలుగు సినిమా మార్కెట్ ను రూ.200 కోట్ల పెంచినా.. పరభాషా నటులు కూడా టాలీవుడ్ సినిమాల గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు అన్నా.. అసలు ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి అన్నా అది మన రాజమౌళి వల్లనే అని చెప్పాలి. అయితే రాజమౌళి అనుకున్న టైంకి సినిమా ఫినిష్ చేయడం అన్నది ఇప్పటివరకు జరగలేదు.
రాజమౌళితో సినిమాకి కమిట్ అయిన ఏ నటీనటులకు అయినా చాలా సహనం కావాలి అంటూ ఉంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. ఇటీవల రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ కూడా ‘నా కొడుకు బాగా స్లో’ అంటూ ఓ మాట అనేసారు. ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీలో రాజమౌళిని అంతా జక్కన్న అంటూ ఉంటారు. ఆయన తీసే సినిమాని తొందరగా తెవల్చడు అని సరదాగా అందరూ అలా అంటుంటారు.

అయితే ఆ పేరు రాజమౌళికి పెట్టిన నటుడు ఎవరో తెలుసా? సుమ భర్త రాజీవ్ కనకాల. ‘శాంతినివాసం’ సీరియల్ నుండీ ‘యమదొంగ’ మూవీ వరకు రాజమౌళితో ట్రావెల్ అవుతూ వచ్చాడు రాజీవ్. అయితే అటు తర్వాత రాజమౌళి సినిమాల్లో అతను కనిపించలేదు. అయితే ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఎంతటికి తన షాట్ ఓకే చేయకపోవడంతో అందరిముందు జక్కన్న అని రాజమౌళిని పిలిచాడట రాజీవ్ కనకాల.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!














