The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్'(The Paradise) నిన్న రిలేజ్ అయ్యింది. ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేసిన పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో మొదటి నుండీ మంచి హైప్ ఏర్పడింది. అయితే ప్రీమియర్ షోలతో ఈ సినిమాకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ డిజప్పయింట్ చేసింది అని ఎక్కువ శాతం ప్రేక్షకులు చెప్పారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ వసూళ్లు సాధించింది.

The Paradise

మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ‘ది ప్యారడైజ్’ చిత్రం రూ.78 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తెలుగులో ఆల్మోస్ట్ రూ.45.25 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసినట్టు అంచనా.! అయితే ఇది పాన్ ఇండియా సినిమా..! మరి మిగతా వెర్షన్ల సంగతేంటి? అనే డౌట్ చాలా మందిలో ఉంది. తెలుగులోనే కాదు ఇండియా వైడ్ ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేశాడు నాని. పాన్ ఇండియా వైడ్ తన సినిమాకి రీచ్ రావాలని పరితపించాడు.

ముఖ్యంగా హిందీ కలెక్షన్ల గురించి తెలుసుకోవాలని మన వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంది. ఎందుకంటే.. హిందీలో సౌత్ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. టాక్ బాగుంటే.. ఇక్కడ కంటే, అక్కడే ఎక్కువ కలెక్ట్ చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ సినిమా హిందీ వెర్షన్ రూ.2.45 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసిందట. ఈ లెక్క చిన్నదేమీ కాదు..! అయితే అక్కడ 2వ రోజు వసూళ్లని బట్టి.. సినిమాకి ఎలాంటి ఆధారణ లభిస్తుంది అనేది ఓ అంచనాకి రాగలం.!

విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus