The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా కయాడు లోహర్ హీరోయిన్ గా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్'(The Paradise). ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ఇది. ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మోహన్ బాబు అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు.

The Paradise

‘ఆయా షేర్’ ‘ఏష నాగుల’ పాటలు చార్ట్ బస్టర్ అయ్యి ఈ సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ట్రెయిలర్ కూడా లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. అందుకే బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. సెప్టెంబర్ 24న విడుదల కాబోతున్న ఈ సినిమాకి ధియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందో, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :

నైజాం  31.5 cr
సీడెడ్  10 cr
ఉత్తరాంధ్ర  7.5 cr
ఈస్ట్  4.8 cr
వెస్ట్  3.4 cr
గుంటూరు  4.6 cr
కృష్ణా  4.3 cr
నెల్లూరు  2.2 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  68.3 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  10 cr
ఓవర్సీస్  18 cr
వరల్డ్ వైడ్ టోటల్  96.3 cr

‘ది ప్యారడైజ్’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.96.3 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.97 కోట్ల షేర్ ను రాబట్టాలి. అంటే ఫుల్ రన్లో సొ ఓవరాల్..గా రూ.160 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేయాలి. డే1 అడ్వాన్స్ బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడాలి మరి మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో.!

ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus