డైరెక్టర్ లేని టైమ్ చూసుకుని 8 నిమిషాలు ట్రిమ్ చేశాడట.. కట్ చేస్తే.!

త్వరలో రిలీజ్ కాబోతున్న ఒక సినిమాకి సంబంధించిన ముచ్చట ఇది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకంటున్న ఒక హీరో.. కొత్తగా డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న ఒక కుర్రాడు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. పెద్ద నిర్మాతకి (Producer) చెందిన చిన్న బ్యానర్లో రూపొందుతున్న సినిమా ఇది. ప్రమోషనల్ కంటెంట్ అంతా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ సినిమా పై టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. హీరో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Producer

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తయిపోయాయి. ఆ నమ్మకంతో దర్శకుడు ఊరు వెళ్లడట. అతను అలా వెళ్లాడో లేదో .. నిర్మాత (Producer) షో వేయించుకుని చూశాడట. సినిమా అంతా ఓకే అని చెప్పిన ఆ నిర్మాత , ఇప్పుడు మరో 8 నిమిషాల పాటు ట్రిమ్ చేయించాడట. ఆ తర్వాత ఊరు నుండీ వచ్చిన దర్శకుడు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యాడట.

తాను లేకుండా, కనీసం చెప్పకుండా.. తన సినిమాలో 8 నిమిషాలు ట్రిమ్ చేయడం ఏంటి అని .. ఫ్రస్ట్రేట్ అయ్యాడట ఆ యువ దర్శకుడు. ఈ విషయం తెలుసుకున్న హీరో .. ‘పెద్ద నిర్మాతలు (Producer) ఇలానే ఉన్నారు ఇప్పుడు. అతనికి వ్యతిరేకంగా ఏమీ చేయలేవు. సినిమా అయితే బాగా వచ్చింది’ అని సర్దిచెప్పాడట.

ఈ బాలీవుడ్ హీరో మలయాళం ఎందుకు నేర్చుకుంటున్నాడో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus