సంక్రాంతి అంటేనే సినిమాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. అయితే రాబోయే 2026 సంక్రాంతికి పోటీపడబోయే చిత్రాలలో మొదటి వరుసలో ఉన్న చిత్రం ‘రాజాసాబ్’. ప్రభాస్-మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ముగ్గురు హీరోయిన్లు గా నటిస్తున్నారు.
ఈ మూవీ రన్ టైం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అది ఏంటంటే రాజాసాబ్ కి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడి టికెట్స్ బుకింగ్ యాప్స్ లో రన్ టైం 3.15 గం.లు చూపిస్తుంది అంట. అది చుసిన ప్రేక్షకులు రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా…? అని అనుకుంటున్నారట. రన్ టైం కి సంబందించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
దీంతో ఇండియా లో కూడా ఇదే రన్ టైం ఉంటుందా లేక ఏమైనా మార్పు ఉంటుందా అనే కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్, ఫస్ట్ సింగల్ తో రాజా సాబ్ మూవీ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఇందులో ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా హారర్ కామెడీ జానర్లో కొత్త క్యారెక్టర్ లో కనపడబోతున్నాడు.