Badshah Live Concert: హైదరాబాద్లో పాపులర్ ర్యాపర్ బాద్ షా మ్యూజికల్ కాన్సర్ట్ షో!

అతన్ని అంతా ‘ర్యాప్ లెజెండ్’ అని అంటుంటారు. షాపింగ్ మాల్స్ లో, మల్టీప్లెక్సుల్లో, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో.. ఇలా ఎక్కడ చూసినా, అతను కంపోజ్ చేసిన ర్యాప్ ఆల్బమ్సే ప్లే అవుతూ ఉంటాయి. యువతని ఉర్రూతలూగించడానికి ముందుంటాడతను. అతను ఎవరో ఈపాటికే మీకు అర్ధమైపోయుంటుంది.! యెస్.. అతనే బాద్ షా. ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా ఇతని అసలు పేరు అయినప్పటికీ బాద్ షా గా చాలా పాపులర్ అయ్యాడు.

సింగర్ గా ర్యాపర్ గానే కాకుండా బిజినెస్మెన్ గా, ఫిలిం ప్రొడ్యూసర్ గా ఇతను బాగా ఫేమస్. పాప్, దేశి హిప్ హాప్, బాలీవుడ్, హిప్ హాప్ వంటి జెనర్స్ లో ఇతను మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాడు. టి.సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీ, యష్ రాజ్ ఫిలిమ్స్(వై ఆర్ ఎఫ్), యూనివర్సల్ మ్యూజిక్ వంటి సంస్థల్లో ఇతని ఆల్బమ్స్ చేయడం జరిగింది. ఇతను కంపోజ్ చేసిన ‘జుగ్ను’ ర్యాప్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. దేశ,విదేశాల్లో ఈ ర్యాప్ సాంగ్ మార్మోగింది. తమన్నా, రకుల్ వంటి హీరోయిన్లతో ఇతను ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాడు.

ఇక అసలు విషయమేంటంటే..హైదరాబాద్ లో ఇతని లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ షో జరగబోతోంది. జూన్ 24న గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రఖ్యాత తమడా మీడియా సంస్థ నేతృత్వంలో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఆసక్తి కలిగిన వారు లింక్ ఇన్ బయోలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ‘TAMADA 10 ‘ అనే కూపన్ కోడ్ ని ఎంటర్ చేయడం ద్వారా 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Click Here For Tickets

.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus