Gudachari 2: శేష్‌… కొత్త సినిమా కోసం భారీ ప్లాన్స్‌… ఏం చేస్తున్నారంటే?

  • August 5, 2023 / 11:51 AM IST

‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్‌ వస్తుంది అని చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా తొలి సినిమాకు మంచి ఉంటుందని టీమ్‌ పోస్టర్‌తోనే చెప్పేసింది. ఇంకేముంది పోస్టర్‌ ఇచ్చేశారు, ముహూర్తం అయిపోయింది కాబట్టి… త్వరలోనే సినిమా ప్రారంభం అనుకున్నారు. అయితే అడివి శేష్‌ వరుస సినిమాలు చేసి వచ్చాడు కాబట్టి కాస్త గ్యాప్‌ తీసుకుంటాడు అని చెప్పి ‘గూఢచారి 2’ అలియాస్‌ ‘జి 2’ ఆలస్యంగా మొదలవుతుంది అని చెప్పారు. అయితే ఏమైందో ఏమో ఈ సినిమా ఇంకా మొదలుకాలేదు. దీంతో ఏం జరుగుతోంది అనే ప్రశ్న మొదలైంది.

సినిమా అనుకున్నది మొదలు… టీమ్‌ ఆ సినిమా కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నారు అని మాత్రం మధ్య మధ్యలో వార్తలొచ్చాయి. అయితే ఎక్కడా క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమా ఆలస్యం విషయంలో చిన్నపాటి స్పష్టత వచ్చింది. ఈ సినిమా ఎందుకు అలస్యం అవుతోంది అనే వివరాలు తెలిశాయి. ‘గూఢచారి’ సినిమా విడుదలై అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా శేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. దాంతోపాటు ‘జీ 2’ గురించి కూడా మాట్లాడాడు. ఆ సినిమాపై హైప్‌ పెంచేలా కొన్ని విషయాలు చెప్పాడు.

ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలే వైరల్‌గా మారాయి. ‘గూఢచారి’ సినిమాను మించేలా ఇంటర్నేషనల్ లెవల్‌లో ‘జీ 2’ సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని అడివి శేష్‌ చెప్పాడు. బెస్ట్‌ అవుట్‌పుట్ కోసమం ప్రీ ప్రొడక్షన్ పని పెద్ద ఎత్తున జరుగుతోందని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేర్వేరు దేశాల్లో జరుగుతున్నట్లు చెప్పాడు. దీంతో ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశాడు.

ఇక మిగిలిన సినిమాల్లా కాకుండా ఈ సినిమాను అసలు సిసలు పాన్ ఇండియా మూవీలా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. తెలుగు వరకు ఏదో హంగామా చేసి మిగతా భాషల్లో మొక్కుబడిగా రిలీజ్ చేసేలా కాకుండా ఫుల్‌ ప్లెడ్జ్‌ పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తారట. అన్నట్లు ఈ సినిమాను వినయ్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus