Allu Sneha Reddy: ఆ కోరిక తీర్చుకోవడం కోసమే స్నేహారెడ్డి ఫోటోషూట్స్ చేస్తున్నారా?

  • November 23, 2022 / 06:53 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. పుష్ప సినిమా ముందు వరకు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే సినీ కెరియర్ పరంగా అల్లు అర్జున్ ఎంతో సక్సెస్ ఫుల్ అయ్యారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఈయన ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

2011వ సంవత్సరంలో స్నేహ రెడ్డి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారి తన వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఇక స్నేహ రెడ్డి సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు.ఈమె తండ్రి ప్రముఖ విద్యా సంస్థలను నడపడమే కాకుండా ఎన్నో వ్యాపారాలను చేస్తూ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు పొందారు.ఇకపోతే అల్లు అర్జున్ ని వివాహం చేసుకున్న తర్వాత స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఈమె యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలు భర్తకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఈమె తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. పలువురు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా తన దుస్తులను డిజైన్ చేయించుకొని ఫోటోషూట్స్ నిర్వహించడం చేస్తుంటారు. ఇలా హీరోయిన్ రేంజ్ లో ఈమె ఫోటోషూట్స్ నిర్వహించి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ఈ విధంగా ఈమె హీరోయిన్లకు సమానంగా ఫోటోషూట్ చేయించడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.

ఈమె పెళ్లికాకముందు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతో ఆశపడ్డారట. ఇదే విషయాన్ని తన తండ్రి దగ్గర ప్రస్తావించగా తన తండ్రి ఎందుకు నో అని సమాధానం చెప్పడంతో చేసేదేమీ లేక తన కోరికను అణిచి వేసుకున్నారు.అయితే ఊహించని విధంగా ఈమె అల్లు అర్జున్ తో ప్రేమలో పడటం సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి కోడలిగా అడుగుపెట్టడమే కాకుండా తనకు పూర్తిగా సపోర్ట్ చేసే భర్త దొరకడంతో తనలో ఉన్న కోరిక మరొకసారి బయటపడింది.

అయితే ఈమె హీరోయిన్ గా నటించకపోయినా హీరోయిన్ రేంజ్ లో డిజైనర్ వేర్ ధరించి ఫోటోషూట్స్ నిర్వహించి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకొని తన కోరికను తీర్చుకున్నారని తెలుస్తోంది.అయితే ఈమె త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలు గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus