Mahesh Babu: అందుకే ఈ మూవీని ‘పోకిరి’ తో పోలుస్తున్నాం: మహేష్ బాబు

  • May 11, 2022 / 12:02 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదల కాబోతుంది. ‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘జీఏంబీ ఎంటర్టైన్మెంట్’, ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు కలిసి నిర్మించాయి. టీజర్,పాటలు, ట్రైలర్ సూపర్ గా అనిపించాయి సినిమా పై అంచనాల్ని కూడా పెంచాయి. దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అటు మహేష్ బాబు అభిమానులు ఇటు ప్రేక్షకులు ‘సర్కారు వారి పాట’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ చిత్రం ‘పోకిరి’ మీటర్లో ఉంటుంది అంటూ తాజాగా మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ” ‘సర్కారు వారి పాట’ లో నా పాత్ర ‘పోకిరి’ మీటర్ లో ఉంటుంది. పోకిరి షేడ్స్ లో వున్న క్యారెక్టర్ మళ్ళీ ఇన్నాళ్టికి దొరికింది. ‘పోకిరి’ చూస్తే థియేటర్లో ఒక మాస్ ఫీలింగ్ వస్తుంది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఈ మూవీలో కుదిరింది.పరాశురాం గారు అద్భుతమై రచయిత. అంత అద్భుతమైన రచయిత దర్శకుడైతే అద్భుతంగా ఉంటుంది.

పరశురాం గారి ‘గీత గోవిందం’ నాకు చాలా నచ్చింది. పరశురాం సర్కారు వారి పాట కథ చెప్పినపుడు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మరో ఆలోచన లేకుండా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.’దూకుడు’ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చారు. ఫారిన్ లో వున్న లవ్ ట్రాక్ రిపీట్ ఆడియన్స్ రావడానికి మెయిన్ రీజన్ అయ్యింది. ఆ ట్రాక్ చాలా ఎంజాయ్ చేశారు. సర్కారు వారి పాట లో కూడా అలాంటి లవ్ ట్రాక్ కుదిరింది. ఖచ్చితంగా ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తారు” అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus