Pawan Kalyan: పవన్ కళ్యాన్ ఆ యంగ్ హీరోని కొట్టడానికి కారణం అదేనా..!

  • November 10, 2023 / 03:19 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆన్ స్క్రీన్ మీద కంటే ఎక్కువ ఆఫ్ స్క్రీన్ లోనే ఇష్టపడుతూ ఉంటారు ఫ్యాన్స్. ఆయనని ఒక సినిమా హీరో లాగ కాకుండా తమ సొంత కుటుంబ సభ్యుడి లాగ భావిస్తుంటారు అభిమానులు. అందుకే హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంతే కాదు ఆయనతో పని చేసిన ప్రతీ ఒక్కరు చెప్పే మాట, అలాంటి నిజాయితీ ఉన్న వ్యక్తిని బయట ఎక్కడా చూడలేదు అనే.

మంచిగా ఉంటే చాలా గౌరవం ఇస్తాడు. తేడా చేస్తే ఆయన ముందు నిలబడడం కూడా కష్టమే అని అంటుంటారు. ఒక వ్యక్తి గురించి తన దగ్గర తప్పుగా మాట్లాడితే అసలు ఒప్పుకోడు,దమ్ముంటే ఆ వ్యక్తి ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడు, ఆ వ్యక్తి ఇక్కడ లేనప్పుడు మాట్లాడడం కాదు అని అంటాడు అంటూ ఆయన స్నేహితుడు కమెడియన్ అలీ పలు ఇంటర్వ్యూస్ లో తెలిపాడు.

ఇదంతా పక్కన పెడితే గతం లో ఒక యంగ్ హీరో విషయం లో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. తన ముందు వేరే వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే సహించని పవన్ కళ్యాణ్, ఇక తన అన్నయ్య చిరంజీవి కూతురు గురించి తప్పుగా మాట్లాడితే సహిస్తాడా?. సరిగ్గా అదే జరిగింది ఒక యంగ్ హీరో విషయంలో.

ఒక ప్రైవేట్ పార్టీ లో బాగా తాగేసి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గురించి చాలా తప్పుగా మాట్లాడాడట ఆ యంగ్ హీరో. ఈ విషయం తన స్నేహితుడి ద్వారా పవన్ కళ్యాణ్ కి తెలిసింది. అంతే నేరుగా ఆ కుర్ర హీరో బెంగళూరు లో నివాసం ఉంటున్న చోటుకు వెళ్లి, చితకబాది, మరోసారి ఆడవాళ్ళ పై తప్పుడు కామెంట్స్ చెయ్యాలంటే వణుకు పుట్టేలా చేసి వచ్చాడట. ఈ విషయం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus