Aadi: జబర్దస్త్ విషయంలో ఆదికి సమస్య ఇదేనా?

  • April 22, 2022 / 07:39 PM IST

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతోందనే సంగతి తెలిసిందే. ఇతర కామెడీ షోల నుంచి పోటీ ఎదురవుతున్నా ఈ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోంది. జబర్దస్త్ షోకు హైపర్ ఆది స్కిట్లు హైలెట్ గా నిలుస్తుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ స్కిట్లు హైలెట్ గా నిలుస్తున్నాయి. వీళ్ల స్కిట్ల వల్లే ఈ కామెడీ షోలకు అంచనాలకు మించి రేటింగ్స్ వస్తున్నాయి.

Click Here To Watch NOW

అయితే గత కొంతకాలంగా ఆది జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. యూట్యూబ్ లో జబర్దస్త్ ప్రోమో విడుదలైన సమయంలో ఆదిని మిస్ అవుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆది ప్రస్తుతం ఈ షోకు దూరంగా ఉండటానికి రెమ్యునరేషన్ కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఢీ డ్యాన్స్ షోలో కనిపిస్తున్న హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించకపోవడంతో ఇది నిజం కావచ్చని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆది అభిమానులు మాత్రం ఆది త్వరలోనే జబర్దస్త్ షోలో రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఆది జబర్దస్త్ కు దూరమైతే అందుకు గల కారణాలను అయినా వెల్లడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జబర్దస్త్ లో ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్లలో ఆది ఒకరు. ఆది స్కిట్లకు యూట్యూబ్ లో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయనే సంగతి తెలిసిందే. హైపర్ ఆదికి సినిమాలలో కూడా బాగానే ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

ఇతర ఛానెళ్ల నుంచి కూడా ఆదికి ఆఫర్లు వస్తున్నా ఆది మాత్రం ఈటీవీ ఛానల్ కు పరిమితం కావడం గమనార్హం. జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన రోజా సైతం మంత్రి పదవి రావడంతో ఈ షోకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోకు వరుస షాకులు తగులుతున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus