Pawan Kalyan: ఖుషి మూవీ రీరిలీజ్ కోసం అప్పటివరకు ఆగక తప్పదా?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఖుషి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఎస్.జే.సూర్య డైరెక్షన్ లో పవన్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించి 2001 సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన విడుదలైన ఖుషి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా అప్పటి యూత్ ను తెగ ఆకట్టుకుంది. అయితే ఖుషి సినిమాను రీరిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఖుషి సినిమా కాకుండా జల్సా సినిమాను రీరిలీజ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. తమ్ముడు సినిమా కూడా రీరిలీజ్ అయినా ఆ సినిమాతో పోల్చి చూస్తే జల్సా సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో 600కు పైగా షోలతో రీరిలీజ్ అయింది. అయితే జల్సాను రీరిలీజ్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది. 2008 సంవత్సరంలో జల్సా మూవీ రిలీజైన సమయంలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారు.

ఆ నెగిటివ్ కామెంట్ల వల్ల సినిమా హిట్ గా నిలిచినా మరీ భారీ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మరోవైపు ఏఎం రత్నం హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన పనులతో బిజీగా ఉండటంతో ఖుషి 4కే ప్రింట్ ను సిద్ధం చేయడం కూడా సులువు కాదని తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఖుషి సినిమాకు బదులుగా జల్సా సినిమా థియేటర్లలో ప్రదర్శితమైంది. ఈ సంవత్సరం కుదరకపోయినా 2023 సంవత్సరంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా ఖుషి సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

ఖుషి సినిమా రీరిలీజ్ అంటే పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఖుషి 4కే వెర్షన్ ను చూడటానికి ఆసక్తి చూపించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమాను 2023 సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus