టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టి వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నా ఆ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తుండటం గమనార్హం. సరైన కథలను ఎంచుకోక పోవడం వల్లే కృతిశెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కృతిశెట్టి స్టార్ హీరో, క్రేజ్ ఉన్న హీరో సినిమా అయితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని అదే ఆమె పాలిట శాపం అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది హీరోయిన్లలా కృతిశెట్టి గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు ఓకే చెబితే ఆమె కెరీర్ కు మరింత మేలు జరుగుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృతిశెట్టి రెమ్యునరేషన్ 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. సినిమాకు అనుగుణంగా కృతిశెట్టి పారితోషికం విషయంలో మార్పులు చేస్తున్నారని సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో కృతిశెట్టి కళ్లు చెదిరే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
కృతిశెట్టికి గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు మూవీ ఆఫర్లు సైతం తగ్గుతున్నాయి. అందువల్ల కృతిశెట్టి కెరీర్ పరంగా జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది. కృతిశెట్టి ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టి సక్సెస్ సాధిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృతిశెట్టిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. కృతికి రాబోయే రోజుల్లో అయినా లక్ కలిసొస్తుందేమో చూడాల్సి ఉంది.
కృతిశెట్టి కొంతకాలం గ్యాప్ ఇచ్చినా పరవాలేదని మంచి కథలను ఎంచుకుని సత్తా చాటాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. అభినయ ప్రధాన పాత్రలను కృతి ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.కృతిశెట్టి శ్రీలీలను ఫాలో అయితే ఆమె కెరీర్ కు మేలు జరుగుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కృతి సినిమాల విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!