Samantha: ఆ కారణం వల్లే సమంత ప్రత్యేక పూజలు చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమెకు ఏ ఆరోగ్య సమస్య లేకపోయినా ఆరోగ్య సమస్య ఉందని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాగా వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని సమంత మేనేజర్ వెల్లడించారు. మరికొన్ని గంటల్లో సమంత నటించిన యశోద సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుండగా సమంత అభిమానులు ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే సమంత తాజాగా వేద పాఠశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో ఈ పూజలు జరిగినట్టు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉండటం వల్ల అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలలో కొందరు పూజారులు, కొందరు విద్యార్థులు ఉన్నారు. తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మంచి ఫలితాలను అందుకోవాలని సమంత ఈ పూజలు చేసిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

సమంతకు సాధారణంగా దైవభక్తి ఎక్కువ కాగా వైరల్ అవుతున్న ఫోటోలలో తన శైలికి భిన్నమైన లుక్ లో సమంత కనిపించడం గమనార్హం. సమంత టాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి.

సమంతకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో సమంత సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం సమంత రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు సమంతను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus