స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరకు బన్నీ పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. బన్నీకి మేకప్ వేయడానికి రెండు గంటల సమయం పడుతోందని బన్నీకి మేకప్ తీయడానికి గంట సమయం పడుతోందని తెలుస్తోంది. రంగస్థలం సినిమాలో చెవిటి వ్యక్తి పాత్రలో చరణ్ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో బన్నీకి కూడా అలాంటి లోపం ఉంటుందని తెలుస్తోంది.
పుష్ప సినిమాలో కొన్ని సీన్లలో బన్నీ తుంటికి దెబ్బ తగిలి భుజానికి గాయమై చెయ్యి పడిపోయినట్టు కనిపిస్తారని తెలుస్తోంది. బన్నీ గతంలో ఏ సినిమా కోసం పడనంత కష్టం ఈ సినిమా కోసం పడుతున్నారు. బన్నీ పుష్పరాజ్ పాత్ర కోసం ఫిట్ నెస్ నిపుణుల సూచనలను కూడా తీసుకున్నారని తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమాతో బన్నీ ఇండస్ట్రీ హిట్ సాధించారు. పుష్ప పార్ట్ 1, పార్ట్ 2తో బన్నీ పాన్ ఇండియా హిట్లు సాధించాలని భావిస్తుండగా ఈ సినిమాలతో బన్నీ అంచనాలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
పుష్ప మూవీ సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా కాగా రంగస్థలంను మించి పుష్ప పార్ట్ 1 సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. బన్నీ ఈ సినిమా తర్వాత ఐకాన్ సినిమాలో నటిస్తున్నారు. ఐకాన్ సినిమా తర్వాత పుష్ప పార్ట్2 లో బన్నీ నటించనున్నారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!