Shiva Movie: ఆ రోల్ లో మోహన్ బాబు నటించి ఉంటే శివ ఇంకా పెద్ద హిట్ అయ్యేదా?

నాగార్జున సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నా శివ సినిమా ప్రత్యేకం అని అభిమానులు భావిస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు చూసినా ఈ సినిమా కొత్త సినిమాను చూసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా సాధించిన ఘన విజయం వల్ల సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించడం సాధ్యమవుతోంది. అయితే ఈ సినిమాలో రఘువరన్ దగ్గర ఉండే రౌడీ రోల్ కోసం మొదట మోహన్ బాబు పేరును పరిశీలిచించారట.

ప్రొడ్యూసర్ అక్కినేని వెంకట్ మోహన్ బాబు పేరును సూచించగా రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆ రోల్ లో మోహన్ బాబును నటింపజేయడానికి అస్సలు అంగీకరించలేదు. టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ బాబు బాగా పరిచయం ఉన్న నటుడని మోహన్ బాబు యాక్టింగ్ కానీ డైలాగ్ డిక్షన్ కానీ స్పెషల్ గా ఉంటుందని మోహన్ బాబు శివ రోల్ కు వార్నింగ్ ఇస్తుంటే ఆయనే కనిపిస్తారు తప్ప కరుడుగట్టిన రౌడీ కనిపించరని వర్మ చెప్పాడట.

ఆ తర్వాత ఆ రోల్ కోసం విశ్వనాథ్ అనే నటుడిని ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నాగార్జున పాపను పట్టుకుని సైకిల్ పై లారీని పట్టుకుని వెళతారు. ఈ సీన్ లో డూప్ లేకుండా నాగ్ నటించారు. శివ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నారు.

నాగార్జున కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రావడం లేదు. నాగార్జున సినిమాల కంటే బిగ్ బాస్ షోకు ప్రాధాన్యత ఇవ్వడం నచ్చడం లేదని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉండగా నాగ్ తర్వాత మూవీ రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. నాగ్ వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శివ (Shiva Movie)సినిమాలో మోహన్ బాబు నటించి ఉంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus