Mahesh Babu: మహేష్ త్రివిక్రమ్ మూవీ డేట్ వెనుక ఇన్ని స్ట్రాటజీలు ఉన్నాయా?

  • March 27, 2023 / 05:40 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఏ సినిమా తెరకెక్కినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. రాజమౌళి సృష్టించిన రికార్డులను బ్రేక్ చేయడం ఇతర సినిమాలకు సులువు కాదు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఇప్పటికే ఎన్నో రిలీజ్ డేట్లను మార్చుకుని 2024 సంక్రాంతికి ఫిక్స్ అయింది. జనవరి 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ కీలక ప్రకటన చేయడం గమనార్హం.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి రికార్డులను బ్రేక్ చేయాలనే ఆలోచనతోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి పండుగకు రిలీజైన సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. మహేష్  త్రివిక్రమ్ కాంబో మూవీ రికార్డులు క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. మహేష్ (Mahesh Babu) శ్రీలీల కాంబినేషన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది. మహేష్ ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తారని సమాచారం అందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఎన్ని సినిమాలు విడుదలవుతాయో చూడాల్సి ఉంది. ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైతే మాత్రం థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus