ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల శనివారం నాడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న తన సొంత నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె సూసైడ్ చేసుకున్న గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ దొరికింది అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆమె కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈమె మృతికి చింతిస్తూ రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.
తనకి ప్రత్యూష డియరెస్ట్ ఫ్రెండ్ అని.. చాలా చిన్న వయసులోనే ఆమె చనిపోయిందని, ఆమె చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేదని అలాంటి ఆమె ఇలాంటి పనిచేసిందంటే నమ్మలేకపోతున్నట్టు ఉపాసన చెప్పుకొచ్చింది. ఒంటరి తనం, డిప్రెషన్ కారణంగానే ప్రత్యూష ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ప్రత్యూష ఆత్మహత్య విషయం ఓ ప్రముఖ హీరోయిన్ కు ముందే తెలుసనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. చనిపోయే ముందు ప్రత్యూష తన స్నేహితులతో వీడియో కాల్ లో మాట్లాడిందట.
అంతేకాదు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రముఖ హీరోయిన్‌తో ప్రత్యూష చివరిసారిగా మాట్లాడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆమె పేరు అయితే బయటకి చెప్పలేదు కానీ. త్వరలోనే ఆమెని కూడా విచారించబోతున్నట్టు పోలీసులు తెలిపారు. చార్కోల్ గ్రిల్లో కార్బన్ మోనాక్సైడ్ కెమికల్ ను ఉంచి మంటను రగిలించగా వచ్చే పొగను పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో ధృవీకరించారు.