అలనాటి అందాల తార ప్రముఖ రాజకీయ నాయకురాలు నగ్మ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకొని అప్పట్లో మంచి హిట్స్ అందుకున్నారు. అయితే చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయ పరంగా కూడా ఆమె మంచి విజయాలను అందుకున్నారు.
ఆర్థికంగా కూడా వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్న ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో నాలుగు సార్లు ప్రేమలో విఫలం అవడం మూలంగా ఆమె పెళ్లికి దూరమైనట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే అప్పట్లో నగ్మా ఒక స్టార్ క్రికెటర్ తో పాటు ముగ్గురు హీరోలతో కూడా ప్రేమాయణం నడిపినట్లు గా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. మొదట ఇండియన్ క్రికెటర్ సౌరబ్ గంగూలీ తో కూడా ఆమె ప్రేమలో ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
వారిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకోవడానికి కూడా వెళ్లారని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ తర్వాత భోజ్ పూరి నటుడితో కూడా నగ్మా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విలన్ గా గుర్తింపు అందుకుంటున్న భోజ్పురి నటుడు రవికిషన్ తో కూడా ఆమె కొన్ని సినిమాలు చేసింది. అయితే వీరు కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమధ్య చాలా పుకార్లు వచ్చాయి. రవి కిషన్ తో విడిపోయిన తర్వాత మరొక భోజ్ పూరి నటుడు మనోజ్ తివారీ తో కూడా నగ్మా ప్రేమలో పడినట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి.
కానీ వీరి బంధం కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. మనోజ్ తివారి సతీమణి నగ్మా తో గొడవ పెట్టుకున్నట్లు కూడా అప్పట్లో ఒక టాక్ అయితే వచ్చింది. ఇక ఆ తర్వాత మరొక పెళ్లయిన హీరోతో కూడా ప్రేమలో ఉన్నట్లుగా రూమర్స్ వచ్చాయి. ఇలా ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా నగ్మా పెద్దగా పట్టించుకునేది కాదు. ఇక ఫైనల్ గా ఆమె రాజకీయాల్లోకి వెళ్లిన అనంతరం పెళ్లి అనే ప్రస్తావన తీసుకురాలేదు.