Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మంచు విష్ణుతో సినిమా దెబ్బకి మళ్లీ ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన ఆ నిర్మాత ఎవరంటే..?

మంచు విష్ణుతో సినిమా దెబ్బకి మళ్లీ ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన ఆ నిర్మాత ఎవరంటే..?

  • February 28, 2023 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు విష్ణుతో సినిమా దెబ్బకి మళ్లీ ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన ఆ నిర్మాత ఎవరంటే..?

సాధారణంగా ఒక భాషలో రీమేక్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఇండస్ట్రీలో మామూలే.. కాకపోతే అదేమంత సులువు కాదు.. ప్రాంతం, నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినా.. కథలోని ఆత్మ మిస్ కాకుండా చూసుకోవాలి.. జాగ్రత్తగా డీల్ చేస్తే హిట్ కొట్టొచ్చు కానీ ఏమాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు తప్పదు.. అలా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే మంచు విష్ణు హీరోగా నటించాడు.. ఆ సినిమా చూసి థియేటర్లలో జనాలు దణం పెట్టేశారు..

వివరాల్లోకి వెళ్తే.. అమీర్ ఖాన్, సోనాలి బింద్రే జంటగా.. నసీరుద్దిన్ షా కీలక పాత్రలో.. జాన్ మాథ్యూ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘సర్ఫరోష్’.. డిఫరెంట్ కథ, ఆకట్టుకునే కథనం, ఆసక్తికరమైన క్యారెక్టర్లు.. అదిరిపోయే పాటలు, నేపథ్య సంగీతం.. అన్నీ కలగలిపి 1999 ఏప్రిల్ 30న వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.. అమీర్, నసీరుద్దిన్ షాల నటనకు మంచి పేరొచ్చింది..ఇక ఈ సినిమాని తెలుగులో మంచు విష్ణు, అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న అనుష్క హీరో హీరోయిన్లుగా..

‘భాషా’ ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో ‘అస్త్రం’ పేరుతో రూపొందించారు.. ఆడియో రంగంలో అగ్రగామి అయిన సుప్రీప్ మ్యూజిక్ అధినేత రాజు హర్వాణి ఈ చిత్రంతోనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.. హిందీలో బ్లాక్ బస్టర్ కాబట్టి.. తెలుగులోనూ ఆడుతుందని.. హెవీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.. నసీరుద్దిన్ షా క్యారెక్టర్ జాకీ ష్రాఫ్ చేశారు.. ఆయన తెలుగులో నటిస్తే ఆ సినిమా డిజాస్టర్ అనడానికి బీజం వేసింది ఈ సినిమానే..

తర్వాత ‘పంజా’, ‘సాహో’ లాంటి కళాఖండాలు చేశారు జాకీ.. ఇక ‘అస్త్రం’ మూవీని భారీ స్థాయిలో విడుదల చేశారు.. అప్పటికే చూసిన సినిమా.. స్లో నెరేషన్.. నటీనటులు యాక్ట్ చేస్తున్నారో.. ఓవరాక్షన్ చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకున్నారు ఆడియన్స్.. ‘సర్ఫరోష్’ రీమేక్ కదా.. విషయం ఉండే ఉంటుంది అని హాళ్లకు వెళ్లిన వాళ్లు కాళ్లకు పని చెప్పారు.. దెబ్బకి థియేటర్లల నుండి పరుగో పరుగు..

సుప్రీం మూవీస్ బ్యానర్ పెట్టి రాజు తీసిన ‘అస్త్రం’ ఆయన పాలిట పిచ్చుక మీద బ్రహ్మాస్తంలా మారింది.. దెబ్బకి భారీ నష్టం.. ఇంకెప్పుడూ నిర్మాణం జోలికి వెళ్లకపోవడం కాదు కదా.. ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదాయన.. పైగా తన సుప్రీం సంస్థను ఆదిత్య మ్యూజిక్‌లో విలీనం చేసేశారు.. ఒక్క సినిమా తేడా కొడితే నిర్మాత అడ్రస్ లేకుండా పోతాడు అనడానికి గల ఎన్నో ఉదాహరణల్లో రాజు ‘అస్త్రం’ కథ కూడా ఒకటి..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Anushka Shetty
  • #Astram
  • #manchu vishnu

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

related news

Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల

27 mins ago
Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

2 hours ago
DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

2 hours ago
Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

2 hours ago
Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

3 hours ago

latest news

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

45 mins ago
Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

2 hours ago
DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

2 hours ago
The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

5 hours ago
Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version