మంచు విష్ణుతో సినిమా దెబ్బకి మళ్లీ ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన ఆ నిర్మాత ఎవరంటే..?

సాధారణంగా ఒక భాషలో రీమేక్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఇండస్ట్రీలో మామూలే.. కాకపోతే అదేమంత సులువు కాదు.. ప్రాంతం, నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినా.. కథలోని ఆత్మ మిస్ కాకుండా చూసుకోవాలి.. జాగ్రత్తగా డీల్ చేస్తే హిట్ కొట్టొచ్చు కానీ ఏమాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు తప్పదు.. అలా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే మంచు విష్ణు హీరోగా నటించాడు.. ఆ సినిమా చూసి థియేటర్లలో జనాలు దణం పెట్టేశారు..

వివరాల్లోకి వెళ్తే.. అమీర్ ఖాన్, సోనాలి బింద్రే జంటగా.. నసీరుద్దిన్ షా కీలక పాత్రలో.. జాన్ మాథ్యూ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘సర్ఫరోష్’.. డిఫరెంట్ కథ, ఆకట్టుకునే కథనం, ఆసక్తికరమైన క్యారెక్టర్లు.. అదిరిపోయే పాటలు, నేపథ్య సంగీతం.. అన్నీ కలగలిపి 1999 ఏప్రిల్ 30న వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.. అమీర్, నసీరుద్దిన్ షాల నటనకు మంచి పేరొచ్చింది..ఇక ఈ సినిమాని తెలుగులో మంచు విష్ణు, అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న అనుష్క హీరో హీరోయిన్లుగా..

‘భాషా’ ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో ‘అస్త్రం’ పేరుతో రూపొందించారు.. ఆడియో రంగంలో అగ్రగామి అయిన సుప్రీప్ మ్యూజిక్ అధినేత రాజు హర్వాణి ఈ చిత్రంతోనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.. హిందీలో బ్లాక్ బస్టర్ కాబట్టి.. తెలుగులోనూ ఆడుతుందని.. హెవీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.. నసీరుద్దిన్ షా క్యారెక్టర్ జాకీ ష్రాఫ్ చేశారు.. ఆయన తెలుగులో నటిస్తే ఆ సినిమా డిజాస్టర్ అనడానికి బీజం వేసింది ఈ సినిమానే..

తర్వాత ‘పంజా’, ‘సాహో’ లాంటి కళాఖండాలు చేశారు జాకీ.. ఇక ‘అస్త్రం’ మూవీని భారీ స్థాయిలో విడుదల చేశారు.. అప్పటికే చూసిన సినిమా.. స్లో నెరేషన్.. నటీనటులు యాక్ట్ చేస్తున్నారో.. ఓవరాక్షన్ చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకున్నారు ఆడియన్స్.. ‘సర్ఫరోష్’ రీమేక్ కదా.. విషయం ఉండే ఉంటుంది అని హాళ్లకు వెళ్లిన వాళ్లు కాళ్లకు పని చెప్పారు.. దెబ్బకి థియేటర్లల నుండి పరుగో పరుగు..

సుప్రీం మూవీస్ బ్యానర్ పెట్టి రాజు తీసిన ‘అస్త్రం’ ఆయన పాలిట పిచ్చుక మీద బ్రహ్మాస్తంలా మారింది.. దెబ్బకి భారీ నష్టం.. ఇంకెప్పుడూ నిర్మాణం జోలికి వెళ్లకపోవడం కాదు కదా.. ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదాయన.. పైగా తన సుప్రీం సంస్థను ఆదిత్య మ్యూజిక్‌లో విలీనం చేసేశారు.. ఒక్క సినిమా తేడా కొడితే నిర్మాత అడ్రస్ లేకుండా పోతాడు అనడానికి గల ఎన్నో ఉదాహరణల్లో రాజు ‘అస్త్రం’ కథ కూడా ఒకటి..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus