స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గురించి, హీరోయిన్ల గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు ఛాన్స్ రావడం వెనుక అసలు కారణం వేరే ఉందని సమాచారం. రజనీకాంత్ తో రోబో సినిమాను తెరకెక్కించిన తరువాత శంకర్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అయితే శంకర్ చరణ్ తో తెరకెక్కించనున్న సినిమాను మొదట విజయ్ తో తెరకెక్కించాలని భావించారని అయితే విజయ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రాలేదని సమాచారం.
కొన్నేళ్ల క్రితం శంకర్ విజయ్ కాంబినేషన్ లో త్రీ ఇడియట్స్ రీమేక్ తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ తో పోలిస్తే చరణ్ రెమ్యునరేషన్ తక్కువ కావడంతో ఈ సినిమాలో నటించే ఛాన్స్ చరణ్ కు వచ్చిందని తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా లాభాల్లో చరణ్, శంకర్ లకు వాటా దక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.