ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్ల టాటూస్ వెనుక అంత కథ ఉందా..!

హీరో, హీరోయిన్లు టాటూస్ వేయించుకోవడం అనేది కొత్త విషయం ఏమీ కాదు.హీరోల్లో నాగార్జున, హీరోయిన్లలో త్రిష వంటి వారి దగ్గర నుండీ ఈ ట్రెండ్ ను మనం చూస్తూనే వస్తున్నాం. ఆ తరువాత చాలా మంది హీరోయిన్లు కూడా టాటూస్ వేయించుకున్నారు. అయితే సమంత, రష్మిక, నయన తార టాటూలు ఎక్కువ హైలెట్ గా నిలుస్తుంటాయి. వారి టాటూస్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేస్తూనే ఉన్నారు.

సమంత వంటి పై 3 టాటూలు ఉన్నాయి. వై.ఎం.సి అనే టాటూ సమంత వీపు పై ఉండటాన్ని మనం గమనించవచ్చు. దానికి మీనింగ్ ‘ఏ మాయ చేసావె’. తన భర్త నాగ చైతన్యతో కలిసి సమంత నటించిన మొదటి సినిమా అది. అంతేకాకుండా తన భర్త పేరు ‘చెయ్’ అని కూడా తన నడుము పై వేయించుకుంది. మరో టాటూ తన రిస్ట్ పై ఉంటుంది. అది ఓ క్రియేటివ్ సింబల్..!

ఇక మరో స్టార్ హీరోయిన్ రష్మిక కుడి చేతి పై కూడా ఓ టాటూ ఉంటుంది. ‘ఇర్ రిప్లేసబుల్’ అనే పదాన్ని ఆమె టాటూగా వేయించుకుంది. దీనికి మీనింగ్ ‘సాటిలేనిది’ అని తెలుస్తుంది. ఇక లేడీ సూపర్ స్టార్ నయన తార వంటి పై కూడా ఓ టాటూ ఉంది. ఈమె ప్రభుదేవాతో డేటింగ్ లో ఉన్న టైములో ‘పి’ అనే లెటర్ ను టాటూగా వేయించుకుంది. కానీ అతనితో బ్రేకప్ అయిన తరువాత దానిని ‘పాజిటివిటీ’ గా మార్చేసుకుంది.

1

2

3

4

5

 

 

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus