నేటి స్టార్ హీరోయిన్స్ కి తొలి ఛాన్స్ వెనుక కథ ఇదే!

  • November 30, 2018 / 12:08 PM IST

సినిమా పరిశ్రమలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు తన ప్రతిభను నిరూపించుకుంటామని చాలా మంది కలలు కంటుంటారు. అలా ఒక్క ఛాన్స్ రాగానే క్లిక్ అవ్వడం అంత ఈజీ కాదు. కానీ నేటి హీరోయిన్స్ కొంతమంది ఒక్క ఛాన్స్ అందుకొని.. కష్టపడి.. ట్యాలెంట్ చూపించి స్టార్ హీరోయిన్స్ అయిపోయారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో .. ఆ ఒక్క ఛాన్స్ ఎలా వచ్చిందో.. తెలుసుకుందాం.

కీర్తి సురేష్‌

తన తల్లి మేనకను చూసి కీర్తి సురేష్ నటి కావాలని చిన్నతనంలోనే అనుకుంది. కానీ తల్లి మాత్రం చదువు తర్వాతే ఏదైనా అని మెలిక పెట్టడంతో ముందు చదువుమీద దృష్టి పెట్టింది. చదువు పూర్తి అయిన వెంటనే సినిమాల్లోకి వచ్చిన కీర్తికి ఇక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. మహానటి మూవీతో స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది.

నివేదా థామస్‌

చెన్నైలో స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే నివేదా థామస్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఓ మలయాళీ సినిమాలో చిన్నపాప క్యారక్టర్‌ చేసింది. ఈ పాత్రకే కేరళ ప్రభుత్వం నుంచి అవార్డును అందుకుంది. తెలుగులో ‘జెంటిల్ మ్యాన్’ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి.. విజయం అందుకొని, బిజీ హీరోయిన్‌ అయిపోయింది.

మెహ్రిన్‌ కౌర్‌

చిన్నతనంలో మెహ్రిన్‌ బొద్దుగా ఉండేది. మెహ్రిన్‌ తల్లికి కూతురు సన్నగా మారాలని కోరిక. ఇండియాలో ఉండగా సన్నపడమని తల్లి ఎంత చెప్పినా మెహ్రిన్‌ బుర్రకెక్కించుకునేది కాదు. ప్లస్‌ టూ అయిపోయిన తర్వాత కెనడా వెళ్లారు. అక్కడ దక్షిణాసియా నుంచి వచ్చిన అమ్మాయిలకు అందాల పోటీ నిర్వహించారట. పోటీలో పాల్గొనాలని మెహ్రిన్‌కి లేకపోయినా తల్లి బలవంతం మీద ఒప్పుకుని పేరు ఇచ్చిందట. అందుకోసం సన్నపడింది. ఆ పోటీల్లో గెలుపొందిన మెహ్రిన్‌ ని పలు కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నాయి. మోడల్‌గా బిజీగా ఉన్న సమయంలోనే మెహ్రిన్‌కి ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాలో అవకాశం వచ్చింది. అలా సన్నపడి మెరుపుతీగలా మారి వెండితెర మీద వెలుగుతోంది.

సాయి పల్లవి

చిన్నతనం నుంచే మంచి డ్యాన్సర్‌ అయిన సాయి పల్లవి పలు డ్యాన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొని సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ మెడిసిన్‌ పూర్తయి డాక్టర్‌ పట్టా చేతికి వచ్చేవరకూ సినిమాల జోలికి పోకూడదని నిర్ణయించుకుంది. ఆమె కోసం “ఫిదా” దర్శకుడు రెండేళ్లు ఆగి, ఆమెతోనే సినిమా చేశారు. ఇది హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

అనుపమా పరమేశ్వరన్‌

మలయాళ ‘ప్రేమమ్‌’ సినిమా ఆడిషన్‌కు అనుపమ ఫోటోలు పంపిందని తెలిసి ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరిగిందట! అనుపమ సినిమాల్లోకి రావడం వారి కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు ఎంత అసంతృప్తిగా ఉన్నా, ‘ప్రేమమ్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడం, ఆ తరువాత ‘అ ఆ’లో పెద్ద విజయం అందించడంతో సినిమాల్లో వెనుతిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది.

రాశీఖన్నా

‍రాశీఖన్నా సరదాగా పాల్గొన్న ఓ ఫోటోషూట్‌ రాశీకి సినిమా అవకాశాన్ని ఇచ్చింది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే.. వాజిలైన్‌ వారు రాశీ చదివే కాలేజీలో అమ్మాయిలకు ఓ ఫోటోషూట్‌ నిర్వహించారు. అందులో పాల్గొన్న అమ్మాయిలకు ఓ వాజిలైన్‌ ఫ్రీగా ఇస్తామన్నారట! ఫ్రీగా వాజిలైన్‌ వస్తోంది కదా అని ఫోటో తీయించుకుందట! ఆ ఫోటోను ఆ కంపెనీ వారు ఆన్‌లైన్‌ పెట్టారు. కట్‌చేస్తే రాశీ ఫోటో ఫెమీనా మ్యాగజైన్‌ కవర్‌పేజీ ప్రత్యక్షమైంది. ఆ మ్యాగజైన్‌ మీద రాశీ ఫోటో చూసి చాలా మంది తమ ఉత్తత్తులకు మోడల్‌గా ఆమెనే ఎంపిక చేసుకున్నారు. మోడల్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ‘మద్రాస్‌ కెఫే’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ చేసింది. ఈ సినిమా తర్వాత బిజీ అయిపోయింది.

అను ఇమ్మాన్యుయెల్‌

తండ్రి సినీ రంగానికి చెందిన వ్యక్తే కావడంతో సినిమాల్లోకి రావడానికి అను ఇమ్మాన్యూయెల్‌ పెద్దగా ఇబ్బంది పడలేదు. మళయాల దర్శకుడు ఒకరు అను ప్రొఫైల్‌ చూసి ఆమెను తన సినిమాలో హీరోయిన్‌గా చెయ్యమని అడిగారట! కానీ చదువు పూర్తి కాకపోవడంతో ఇంట్లో వాళ్ళు అప్పుడే సినిమాల్లోకి రావడానికి ఒప్పుకోలేదట! అలా చదువుకునే రోజుల్లోనే హీరోయిన్‌గా చేసే అవకాశాన్ని వదులుకుంది. టెక్సాస్‌లో చదువు పూర్తి కాగానే వచ్చి మలయాళంలో వెండితెర ప్రవేశం చేసింది. ఆ చిత్రాల్లో చూసి మన స్టార్ హీరోలు అవకాశం ఇచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus