జెమినీ గణేషన్ కూతురి బొట్టు కథ ఇది..!

భానురేఖ గణేశన్ అదేనండీ రేఖ.. ప్రముఖ తమిళ స్టార్ హీరో జెమినీ గణేశన్ గారి కూతురు అన్న సంగతి తెలిసిందే. ‘క్రిష్’ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే. అంతేకాదు అప్పటి తెలుగు సినిమాల్లో కూడా ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ‘ఇంటి గుట్టు’ ‘రంగుల రాట్నం’ ‘అమ్మ కోసం’ వంటి తెలుగు సినిమాల్లో ఈమె నటించింది. అయితే తరువాత ఎక్కువగా హిందీ సినిమాల్లోనే ఈమె నటిస్తూ వచ్చింది. ఈమె భర్త ముఖేష్ అగర్వాల్ చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఈమె బొట్టు పెట్టుకుంటూనే ఉంటుంది. దీని వెనుక ఓ కథ కూడా ఉందట.

ఇందుకు ప్రధాన కారణం ఈమె లవ్ స్టోరీ అని చాలా మంది కథలు కథలుగా చెబుతూ ఉంటారు. గతంలో ఈమె అమితాబ్ బచ్చన్ ను ప్రేమించింది. రేఖను పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నారు అమితాబ్. కానీ కుదర్లేదు.. అమితాబ్… జయ బచ్చన్ ను పెళ్ళి చేసుకున్నారు. రేఖ.. ముఖేష్ ను పెళ్ళి చేసుకున్నారు. అయితే పెళ్ళైనా.. ఈమెకు అమితాబ్ అంటే ప్రేమ తగ్గలేదట. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే..

ఇప్పటికీ అమితాబ్ ను రేఖ ప్రేమిస్తూనే ఉంటుందని బాలీవుడ్ విలన్ పునీత్ ఇస్సార్ భార్య చెప్పినట్టు తెలుస్తుంది. ఓ షూటింగ్ సమయంలో పునీత్ వల్ల.. అమితాబ్ కు యాక్సిడెంట్ అయ్యిందట. ఆ టైములో అమితాబ్ ఇక బ్రతకడం కష్టమే అనుకున్న టైంలో కోలుకుని ఆశ్చర్య పరిచారట. ఇందుకు కారణం అయిన పునీత్ ను మాత్రం ఆమె క్షమించలేదట. అమితాబ్ సర్ది చెప్పడంతో ఈమె ఊరుకుందని పునీత్ భార్య తెలిపింది.

Most Recommended Video

జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus