‘‘సినిమాలో నటిస్తాను… కానీ ప్రచారానికి మాత్రం రాను’’ – ఈ మాటలు వింటే నయనతార గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇలాంటి అధికారిక, అనధికారిక రూల్స్ పెట్టిన వాళ్లు మరికొంతమంది ఉన్నారు. అందులో అజిత్ ఒకరు. అవును అజిత్ తన సినిమా ప్రచారానికి రారు. ‘వలిమై’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో అజిత్ కనిపించకపోతుండేసరికి ఈ విషయం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అజిత్ – కార్తికేయ – హ్యూమా ఖురేసి నటించిన ‘వలిమై’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కార్తికేయ, హ్యూమా ఖురేసి దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమా ప్రచారం చేస్తున్నారు. మొన్నీమధ్య హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కి నిర్మాత బోనీ కపూర్ ముంబయి నుండి వచ్చి మరీ పాల్గొన్నారు. కానీ ఆ ఈవెంట్లో అజిత్ కనిపించలేదు. దీంతో అజిత్ గురించి తెలియనివాళ్లు ‘అజిత్ ఎక్కడ?’ అని చర్చిస్తున్నారు. నిజానికి ఇటీవలకాలంలో అజిత్ ఎప్పుడూ తన సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాలేదు.
సినిమా షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి… కొత్త సినిమా పనిలో పడిపోతుంటాడు అజిత్. అంతేకానీ ఆ సినిమా ప్రచారం, తర్వాత విడుదల, ఆ తర్వాత వసూళ్ల లెక్కలు ఏ రోజూ మాట్లాడలేదు. సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా అనే కాన్సెప్ట్‌లోనే ఉంటాడు అజిత్. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీడియో బైట్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మన నయనతారలా అన్నమాట. అదెందుకు అనేది అజిత్ ఎప్పుడూ చెప్పలేదు.
రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి స్టార్ హీరోలు చాలామంది తమ సినిమాల ప్రచారాలకు వస్తుంటారు. తమిళనాట కాకుండా తెలుగులో కూడా ఈవెంట్లు పెట్టి ప్రచారం చేస్తుంటారు. కానీ అజిత్ అలాంటి ప్రయత్నం చేయడు. సినిమాకు సినిమా టాకే పెద్ద ప్రమోషన్ అని అజిత్ నమ్ముతుంటాడు అని సన్నిహితులు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాలు విజయాలు సాధిస్తూ దూసుకెళ్తుంటాయి. ఇప్పుడు ‘వలిమై’ కూడా అలానే సాగాలని ఆశిద్దాం.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!