బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగచ్చు అనడానికి జెస్సీ ఈరోజు ఎపిసోడ్ లో ఒక ఉదాహరణ. ప్రోమో విడుదల అయినప్పుడు అందరూ జెస్సీ బిగ్ బాస్ హౌస్ నుంచీ బయటకి వెళ్లిపోతాడనే అనుకున్నారు. అయితే, బిగ్ బాస్ జెస్సీ హెల్త్ చెకప్స్ అన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్స్ సలహా మేరకు తిరిగి సీక్రెట్ రూమ్ లో ఉంచారు. నిజానికి నామినేషన్స్ టాస్క్ ఆడేటపుడే జెస్సీ హెల్త్ కండీషన్ ని డాక్టర్ వచ్చి క్షుణ్ణంగా పరిశీలించాడు.
అతనికి మెడికల్ చెకప్ అవసరమని అందుకే హౌస్ నుంచీ బయటకి రావాల్సి ఉంటుందని బిగ్ బాస్ జెస్సీకి కన్ఫెషన్ రూమ్ లో చెప్పాడు. దీంతో భావోద్వేగమైన గుండెతో జెస్సీ బయటకి వచ్చాడు. వాళ్ల ఫ్రెండ్స్ అయిన షణ్ముక్ ఇంకా సిరిలని వదిలివెళ్లేటప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను వచ్చినా రాకపోయినా మీరు ఫైనల్స్ లోకి వెళ్లాలని చెప్పాడు. దీంతో షణ్ముక్ ఇంకా సిరి ఇద్దరూ కూడా వెక్కి వెక్కి ఏడ్చారు. వాళ్ల ఫ్రెండ్షిప్ బాండింగ్ చూసిన ఆడియన్స్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే, బిగ్ బాస్ అన్ని టెస్ట్ లు చేయించిన తర్వాత తిరిగి జెస్సీని గేమ్ లోకి పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో భాగంగా సీక్రెట్ రూమ్ లో జెస్సీని ఉంచారు. దీంతో జెస్సీ తిరిగి వాళ్ల ఫ్రెండ్స్ మాటల్ని, ఆటని సీక్రెట్ రూమ్ నుంచీ చూస్తున్నాడు. మరి బిగ్ బాస్ తిరిగి జెస్సీని హౌస్ లోకి ఎప్పుడు పంపిస్తారు అనేది ఆసక్తికరం. జెస్సీ హెల్త్ ఇప్పుడు భయపడాల్సినంతగా లేదని డాక్టర్స్ చెప్పడం జెస్సీకి ప్లస్ అయ్యింది. అదీ మేటర్.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!