ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) – రష్మిక మందన్న డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ రాయల్ వెడ్డింగ్‌లో వాళ్ల అవుట్‌ఫిట్స్‌తో పాటు అందరి కళ్లు వాళ్ల కస్టమ్-మేడ్ జ్యువెలరీ పైనే పడ్డాయి. ఆ నగల ధర, బరువు, దాని వెనక ఉన్న డిజైన్ స్టోరీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ‘శ్రీ జ్యువెలర్స్’ తో పాటు జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్మిక పెళ్లికి ఏకంగా 1.5 నుంచి 2 కిలోల బరువైన నగలను ధరించింది. వడ్డాణం, మంగళసూత్రం, నెక్లెస్, జడబిళ్ల, బాసికం లాంటి 11 రకాల ఆభరణాల కోసం సుమారు రూ.3 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అచ్చం రాజులా సుమారు అరకిలో (500 గ్రాములు) బరువైన ట్రెడిషనల్ నగలు ధరించాడు.
వీటి వాల్యూ రూ.1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుందట. ముడిసరుకు, అందులో వాడిన స్పెషల్ వజ్రాల వల్లే దీని ధర అంతలా పెరిగినట్లు సమాచారం.ఇది ఒకరోజులో సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కాదు.. ఏకంగా 10 నెలల పాటు శ్రమించి ప్రాణం పెట్టి చెక్కిన కళాఖండం. పెళ్లికి ఏడాది ముందే ఈ జంట జ్యువెలరీ టీమ్‌ను సంప్రదించి.. “మాకు అప్పటికప్పుడు పాపులర్ అయ్యే ట్రెండ్ వద్దు.. తరతరాలుగా గుర్తుండిపోయే ట్రెడిషన్ కావాలి” అని క్లారిటీ ఇచ్చారట.
డిజైనర్ అనమికా ఖన్నా రెడీ చేసిన ఆరెంజ్ గోల్డ్ శారీకి మ్యాచ్ అయ్యేలా.. అచ్చం సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్, పురాతన శిల్పకళ ఉట్టిపడేలా నక్షి డిజైన్‌తో రష్మిక నగలను స్పెషల్‌గా డిజైన్ చేశారు.