Balakrishna: ఆయుధపూజకు సిద్ధమంటున్న బాలయ్య.. అంచనాలు పెంచేశాడుగా!

  • April 1, 2023 / 08:35 PM IST

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల గట్టి పోటీ ఉండగా సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఈ ఏడాది దసరా పోటీకి సంబంధించి ఎన్నో వార్తలు వస్తుండగా దసరాకు తమ సినిమా కచ్చితంగా రిలీజవుతుందని పలు సినిమాల నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. రామ్, రవితేజ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పటికే రాగా బాలయ్య అనిల్ కాంబో మూవీ కూడా దసరాకు రిలీజ్ కానుందని అధికారక ప్రకటన వచ్చింది.

దసరాకు బాలయ్య, బోయపాటి సినిమాలు పోటీ పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. విజయదశమికి ఆయుధ పూజ అంటూ మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో బాలయ్య లుక్ పవర్ ఫుల్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలయ్య అనిల్ కాంబో మూవీ టైటిల్, రిలీజ్ డేట్ అతి త్వరలో ఒకే సమయంలో ప్రకటించనున్నారని బోగట్టా.

బాలయ్య, బోయపాటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. బోయపాటి రామ్ కాంబో మూవీ వెనక్కు తగ్గే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా నిజానిజాలు తెలియాల్సి ఉంది. 2023లో ప్రతి పండుగకు భారీ పోటీ ఉండటం గమనార్హం. బాలయ్య సినిమా దసరాకు రిలీజ్ కాదని భావించి బోయపాటి శ్రీను రిలీజ్ డేట్ ను ప్రకటించారని సమాచారం అందుతోంది.

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ2 తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ త్వరలో రానున్నాయి. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. బాలయ్య బోయపాటి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సినిమా సినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus