ముఖేష్ గుప్తా నటించిన ‘ది వరల్డ్ ఆఫ్ నవాబ్’ సినిమా అందరినీ అలరిస్తుంది

  • October 20, 2023 / 07:56 PM IST

నవాబ్ చిత్రం ఇప్పటికే 95 శాతం పూర్తి అయింది. ఇక 2024లో పాన్ ఇండియాగా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు రంగం సిద్దం అవుతుంది. సినిమా విజయం పట్ల ముఖేష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. నటుడిగా ఇండస్ట్రికి రాకముందు సినిమా బఫ్‌గా ఉండేవాడినని, దాంతో సినిమా ప్రేమికుడికి ఏం కావాలో తెలుసని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే రవి చరణ్‌ దర్శకత్వంలో ఆర్‌ఎమ్‌ నిర్మాణసారథ్యంలో ది వరల్డ్‌ ఆఫ్‌ నవాబ్‌ తెరకెక్కిందని వెల్లడించారు. మంచి వినోదాన్ని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని దీనితో పాటు ఆకట్టుకునే కథనే చిత్రం విజయం అవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ముఖేష్ గుప్తా అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారిందని, ఆసక్తికరమైన కథతో పాటు, భావోద్వేగలతో కూడిన కథను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, ఇలాంటి అంశాలే నవాబ్ చిత్రానికి పిల్లర్స్ అని ముఖేష్ గుప్తా చెప్పారు.

అంతే కాదు కథకు జీవం పోయాలంటే భావోధ్వేగాలను పండించే ఆర్టిస్టులు ఎందో అవసరం అని, ప్రేక్షకులు సినిమాలోకంలో విహరించాలంటే బలమైన తారాగణం కూడా సహాయపడుతుందని, ది వరల్డ్ ఆఫ్ నవాబ్ సినిమాలో ఇలాంటి అన్ని అంశాలు చాలా విస్తృతంగా ఉన్నాయని, కచ్చితంగా నవాబ్ చిత్రం ప్రేక్షకులకు విందు భోజనం అందిస్తుందని తెలిపారు. ముఖేష్ గుప్తా సరసన మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ అనన్య నాగళ్ల నటిస్తోంది. అయితే తక్కువ సమయంలో సాధించడం సవాలుగానే ఉంటుంది, కానీ సరైన ఆలోచనా విధానం ఉంటే దేన్నైనా ఖచ్చితంగా సాధించవచ్చని ముఖేష్ గుప్తా అన్నారు. గత రెండేళ్లలో ముఖేష్ గుప్తా మంచి ప్రాజెక్ట్ లనే చేశారు. నుష్రత్ భారుచా నటించిన “జన్హిత్ మే జారీ” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో సంజయ్‌కు లైఫ్ టర్న్ అయింది. ఆ తరువాత అతను వెనుదిరిగి చూడలేదు. అలాగే జీ మ్యూజిక్ కోసం “రోయేగీ తు సరి సారీ రాత్” అనే మ్యూజిక్ వీడియోలో నటించాడు. ఇది ముఖేష్ గుప్తాకు మంచి పేరును తీసుకొచ్చింది. ఇలా తాను చేసే వినుత్నమైన కార్యక్రమాలు కొత్త దర్శకులను ఆకర్షించాయి. అందుకే ఎన్నో ప్రాజెక్ట్‌ లు తనను వెతుక్కుంటూ వస్తున్నాయి. వచ్చే ఏడాది నవాబ్ చిత్రం విడుదల కానుండగా తాజాగా మరో రెండు ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ముఖేష్ గుప్తా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus