సినిమాలో కథను పంచుకున్న నాగచైతన్య, సమంతలు జీవిత భాగస్వాములయ్యారు. వీరి వివాహం ఈ నెల 6న గోవాలో సింపుల్ గా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎందుకు ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకున్నారనే విషయం అభిమానులను తొలుస్తూనే ఉంది. ఈ విషయాన్ని సమంత ముందు ఉంచగా ఆమె స్పందించారు. రీసెంట్ గా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అసలు సంగతి చెప్పారు. ‘‘నా వివాహం ఓ ప్రైవేటు వేడుకగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగాలని ఎప్పుడో అనుకున్నా.
కావాల్సిన వారు ఆనందంగా ఉండేలా చూసుకోవడం నాకు, చైతూకి చాలా ముఖ్యం. పెళ్లి వైభవంగా నిర్వహిస్తే వచ్చిన అతిథులు ఆ సమయంలో ఎలా ఫీలవుతున్నారో కూడా తెలియదు.అందుకే మా పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే ఇలా ప్లాన్ చేశాం” అని వివరించారు. త్వరలోనే వీరి రిసెప్షన్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి అక్కినేని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అక్కినేని అభిమానులు హాజరుకానున్నారు.