Star Actress :పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

ఒకప్పుడు కథానాయికలుగా ప్రేక్షకులను ఆకట్టుకుని.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలు పక్కన పెట్టేసిన వారు చాలామందే ఉన్నారు.. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో దాదాపుగా ఇండస్ట్రీకి దూరమైపోయిన వారు కొందరైతే.. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినవారు, ఇవ్వబోతున్నవారు ఉన్నారు.. అలా మ్యారేజ్ తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయిన ఇండియన్ హీరోయిన్లు ఎవరో చూద్దాం..

1) లయ..

విజయవాడ అమ్మాయి లయ తెలుగులో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కెరీర్ బాగానే కొనసాగుతున్న టైంలో డాక్టర్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది.. చాలా కాలం తర్వాత రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ లో తను కాసేపు కనిపిస్తూ.. పిల్లలిద్దరినీ బాల నటులుగా పరిచయం చేసింది.. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన లయ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం..

2) ప్రియాంక చోప్రా..

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లో సిరీస్, సినిమాలు చేస్తూ.. అక్కడి వ్యక్తినే పెళ్లాడి సెటిలైపోయింది..

3) కలర్స్ స్వాతి..

యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ కమ్ సింగర్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన కలర్స్ స్వాతి కూడా పెళ్లి తర్వాత యూఎస్‌లో ఉంటుంది.. ఇటీవలే ‘పంచతంత్రం’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది..

4) మీరా జాస్మిన్..

మలయాళీ భామ మీరా జాస్మిన్ తెలుగులో స్టార్ స్టేటస్ దక్కించుకుంది.. వివాహం చేసుకున్నాక కొన్నాళ్లు భర్తతో కలిసి అబ్రోడ్‌లో ఉంది.. విడాకుల తర్వాత ఇండియా వచ్చేసింది..

5) రిచా గంగోపాధ్యాయ్..

‘లీడర్’, ‘మిర్చి’, ‘మిరపకాయ్’, ‘భాయ్’ సినిమాలు చేసిన రిచా గంగోపాధ్యాయ్.. స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లి ప్రేమలో పడి పెళ్లి చేసుకుని అక్కడే ఫిక్స్ అయిపోయింది..

6) గోపిక..

‘నా ఆటోగ్రాఫ్’ తో తెలుగు తెరకు పరిచయమైన గోపిక.. తమిళ్, మలయాళంలోనూ నటించింది.. డాక్టర్‌ని మ్యారేజ్ చేసుకుని ఆస్ట్రేలియాలో ఉంటుంది..

7) రంభ..

రంభ, బిజినెస్ మెన్ ఇంద్ర కుమార్‌ని పెళ్లాడి టొరొంటోలో కాపురముంటుంది.. వీరికి ముగ్గురు పిల్లలున్నారు..

8) అంకిత..

చిన్నప్పుడు రస్నాబేబీగా పాపులర్ అయిన అంకిత.. హీరోయిన్‌గా ‘లాహిరి లాహిరి లాహిరి లో’, ‘సింహాద్రి’ లాంటి సినిమాలతో అలరించింది.. వ్యాపారవేత్తను వివాహం చేసుకుని న్యూజెర్సీలో ఉంటుంది.. ఆమెకు ఇద్దరు కిడ్స్..

9) కీర్తి రెడ్డి..

‘తొలిప్రేమ’ ఫేమ్ కీర్తి రెడ్డి.. సుమంత్‌తో విడిపోయాక మరో వ్యక్తిని మనువాడింది.. యునైటెడ్ స్టేట్స్‌లో సెటిలైపోయింది..

10) అన్షు అంబానీ..

‘మన్మథుడు’ లో నటించి మెప్పించిన అన్షు అంబానీ పెళ్లి తర్వాత లండన్‌లో ఉంటుంది..(Actress) ఆమెకు ఓ పాప.. క్లాతింగ్ లేబుల్ బిజినెస్‌లో రాణిస్తుంది అన్షు..

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus