Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 17, 2026 / 03:24 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సాయి తేజ్ (Hero)
  • వేద జలంధర్ (Heroine)
  • ప్రదీప్ కొట్టే,స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ తదితరులు (Cast)
  • వి.మునిరాజ్ (Director)
  • కిరణ్ అబ్బవరం (Producer)
  • వంశీ కాంత్ రేఖన (Music)
  • అక్షయ్ రామ్ పొదిశెట్టి (Cinematography)
  • వి.మునిరాజ్ (Editor)
  • Release Date : 17th ఏప్రిల్ 2026
  • కెఎ ప్రొడక్షన్స్ & సుమైరా స్టూడియోస్ (Banner)

కిరణ్ అబ్బవరం పూర్తిస్థాయి నిర్మాతగా మారి,అంతా కొత్తవాళ్ళని పెట్టి ‘తిమ్మరాజుపల్లి TV’ అనే చిత్రాన్ని నిర్మించాడు. తాను హీరోగా చేసిన సినిమాలని ఏ రేంజ్లో ప్రమోట్ చేస్తుంటాడో.. కొత్త వాళ్ళతో చేసిన ఈ ‘తిమ్మరాజుపల్లి TV’ని కూడా అదే రేంజ్లో ముందుండి ప్రమోట్ చేశాడు కిరణ్ అబ్బవరం. అందువల్ల ఈ సినిమాపై మొదటి నుండి ఆడియన్స్ దృష్టి పడింది. మరి నిర్మాతగా వేసిన ఈ తొలి అడుగు కిరణ్ అబ్బవరంకి ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకుందాం రండి :

Thimmarajupalli TV Movie Review

Thimmarajupalli TV Movie Review and Rating

కథ: 1990ల టైంలో ఈ కథ జరుగుతుంది. తిమ్మరాజుపల్లి అనే ఓ చిన్న గ్రామం. పండుగల టైంలో ఆ ఊర్లో జనాలంతా చందాలు వేసుకుని ఓ గుడి వద్దకు టీవీని అద్దెకు తెచ్చుకుంటారు.వీసీఆర్ సదుపాయంతో కొత్త సినిమాలు వేసుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడికి టీవీ అద్దెకు తెచ్చేది సత్తి అలియాస్ సతీష్(సాయి తేజ్). టీవీల ఓనర్ల వద్ద కమిషన్ తీసుకోవడంతో పాటు… తన సరదాల కోసం ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు సతీష్. అదే ఊరికి చెందిన రాజప్ప(ప్రదీప్ కొట్టే) చెల్లెలు శారద, సతీష్ గాఢంగా ప్రేమించుకుంటారు.

తర్వాత రాజప్ప పెళ్లి అవుతుంది. కట్నం డబ్బులతో ఓ టీవీని, డిష్ ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటాడు. దీంతో ఆ ఊర్లోని జనాలు అంతా రోజూ రాజప్ప ఇంటికి వచ్చి టీవీ చూస్తుంటారు. కానీ కొత్తగా పెళ్ళైన రాజప్పకి ప్రైవసీ కరువవ్వుతుంది. రాజప్ప ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు.. చెల్లెలు ప్రేమ వ్యవహారం అతని తండ్రికి తెలుస్తుంది. దీంతో సతీష్ తో గొడవకి దిగుతాడు రాజప్ప తండ్రి. ఈ క్రమంలో.. సతీష్ పై చేయి చేసుకుంటాడు రాజప్ప. సతీష్ కూడా తగ్గకుండా రాజప్ప పై మాటల యుద్దానికి దిగుతాడు. ఆ గొడవ తర్వాతి రోజు రాజప్ప ఇంట్లో టీవీ దొంగిలించబడుతుంది. అలాగే సతీష్ పై కూడా దాడి జరుగుతుంది. ఇవి చేసింది ఎవరు? టీవీ ఏమైంది? అనేది మిగిలిన కథ.

Thimmarajupalli TV Movie Review and Rating

నటీనటుల పనితీరు: హీరో సాయి తేజ్ లుక్, డైలాగ్ మాడ్యులేషన్ బాగుంది. తన పాత్రకి అతను పూర్తి న్యాయం చేశాడు. అయితే ఇతని కంటే రాజప్ప పాత్ర చేసిన ప్రదీప్ కి ఎక్కువ మార్కులు పడతాయి. తన పాత్రలో జీవించేశాడు ప్రదీప్. అతని భార్య ఎల్లమ్మ పాత్రలో స్వాతి కూడా బాగా చేసింది. శారద పాత్ర చేసిన వేద జలంధర్ లుక్స్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. అమ్మ రమేష్, సత్య నారాయణ వంటి వారు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా బాగా చేశారు.

Thimmarajupalli TV Movie Review and Rating

సాంకేతిక నిపుణుల ప‌నితీరు: వి.మునిరాజ్ మంచి నోస్టాల్జిక్ ఫీల్ కలిగించేలా ‘తిమ్మరాజుపల్లి TV’ కథని డిజైన్ చేసుకున్నాడు. రూటెడ్ కథలకి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. నిజమే 90ల టైంలో ప్రతి ఇంటికి టీవీ ఉండేది కాదు. 10 ఇళ్ళకి ఒక్క టీవీ అన్నట్టు ఉండేది. ఊర్లల్లో ఉండే జనాలు.. సాయంత్రమైతే చాలు టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, వాళ్ళు టీవీ కట్టే వరకు అక్కడే ఉండిపోయేవారు. ఆ సమయాల్లో టీవీ ఉన్న ఇంట్లో వాళ్ళ ప్రైవసీకి ఇబ్బందులు కలిగేవి, దీంతో అక్కడికి వచ్చే జనాలపై నోరు పారేసుకుని గొడవలు పెట్టుకునే వారు. కథగా చెప్పుకుంటే చాలా మంచి లైన్ & కథనం ఇది.

కామెడీకి బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో ట్విస్టులు బాగున్నాయి. కానీ అంతా కొత్త వాళ్ళతో ఇలా క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం అనేది కూడా ఇప్పుడు గొప్ప విషయమే. ఇక కిరణ్ అబ్బవరం నిర్మాణ విలువలు టెక్నికల్ టీం సినిమాకి బాగా కష్టపడ్డారు. పాటలు బాగున్నాయి. సౌండింగ్ కూడా క్వాలిటీగా అనిపించింది. విజువల్స్ కూడా బాగున్నాయి.

Thimmarajupalli TV Movie Review and Rating

విశ్లేషణ: ‘తిమ్మరాజుపల్లి TV’ లో 90’s ఆడియన్స్ ఫీలయ్యే నోస్టాల్జిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రూటెడ్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంది.

Thimmarajupalli TV Movie Review and Rating

ఫోకస్ పాయింట్: మంచి నోస్టాల్జిక్ ఫీల్ ఇచ్చే విలేజ్ డ్రామా!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Thimmarajupalli TV

Reviews

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

24 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

10 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

12 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version