ఈ టాలీవుడ్ హీరోయిన్లకు అన్నీ ఉన్నా అదృష్టం లేదా?

  • February 9, 2023 / 11:28 AM IST

సాధారణంగా సినిమాలు సక్సెస్ సాధిస్తే హీరోయిన్లకు ఆఫర్లు క్యూ కడతాయి. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ సినిమాలు సక్సెస్ సాధించినా సరైన ఆఫర్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేరింది. అయితే ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా ఆఫర్లు అయితే లేవనే సంగతి తెలిసిందే.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుతున్న శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం సలార్ సినిమా తప్ప మరే సినిమా లేదు.

డీజే టిల్లు సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న నేహాశెట్టికి కూడా ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే. బింబిసార సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న కేథరిన్ కు కూడా ఈ సినిమా తర్వాత ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. వాల్తేరు వీరయ్య సినిమా కూడా కేథరిన్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలిచినా కేథరిన్ కు ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే రావడం లేదనే సంగతి తెలిసిందే.

ఈ టాలీవుడ్ హీరోయిన్లకు అన్నీ ఉన్నా అదృష్టం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలు సక్సెస్ సాధించినా ఈ హీరోయిన్ల జాతకాలు మారడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. హిట్ హీరోయిన్లకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎందుకు ఆఫర్లు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది హీరోయిన్లు ఫ్లాపుల్లో ఉన్నా వాళ్లకు మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విచిత్రమైన పరిస్థితి వల్ల హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారు.

కృతి శెట్టి, శ్రీలీల, రష్మిక, పూజా హెగ్డే, సమంత మాత్రం వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus