ఈవారం మీ సినిమా ఛాయిస్ ఏంటి ?

ఎప్పుడో సంక్రాంతి, దసరా పండుగకు ఒకేరోజు మూడునాలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి. అలా కాకుండా మామూలు టైమ్ లో రెండు మూడు సినిమాలు విడుదలైనా చెప్పుకోదగ్గవి ఒకటో రెండో ఉండేవి. కానీ.. చాలాకాలం తర్వాత రేపు (శుక్రవారం) మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నాయి. మరి వాటిలో మీరు మొదట ఏ సినిమాకి వెళ్లాలనుకొంటున్నారో డిసైడ్ చేసుకోండి..

నేనే రాజు నేనే మంత్రి : ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో అందరికీ మంచి అంచనాలు ఈ సినిమా మీదే ఉన్నాయి. “బాహుబలి” అనంతరం రాణా నటించిన చిత్రం కావడం ఒక్కటే ఈ సినిమా బిగ్గెస్ట్ ఎస్సెట్. విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన రావడంతోపాటు ఎన్నడూలేని విధంగా నిర్మాత సురేష్ బాబు ఒక సినిమా చూసి “అదిరిపోయింది” అని కితాబివ్వడమే కాకుండా విడుదల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం సినిమాకి పెద్ద ప్లస్. కాజల్ అగర్వాల్, కేతరీన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రం దర్శకుడు తేజ కెరీర్ లో కీలకం కానుంది. మరి సినిమా రిజల్ట్ ఏమిటన్నది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

లై : “అ ఆ” అనంతరం నితిన్ నటించిన సినిమా కావడం, “కృష్ణగాడి వీరప్రేమగాధ” అనంతరం హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సినిమా కూడా కావడంతో “లై” సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. మణిశర్మ బాణీలు సమకూర్చిన “లై” ఆల్బమ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. దానికితోడు విడుదలైన టీజర్-ట్రైలర్ లో నితిన్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తుండడం ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను అమాంతం పెంచేసింది. ఇవన్నీ కాకుండా యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ ప్లే చేయడం సినిమాకి పెద్ద ఎస్సెట్.

జయ జానకి నాయక : హీరో-హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి ఎవరూ పట్టించుకోకుండా కేవలం “బోయపాటి సినిమా” అనే మార్క్ చూసి థియేటర్లకి ప్రేక్షకులు వచ్చేసిన చేయగల సత్తా ఉన్న ఏకైక చిత్రం “జయ జానకి నాయక”. బెల్లంకొండ శ్రీనివాస్-రకుల్ జంటగా నటించిన ఈ చిత్రంపై మాస్ ఆడియన్స్ మినహా మరో వర్గం ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు లేవు. మొదటిరోజు టాక్ ను బట్టి సెకండ్ డే కలెక్షన్స్ డిసైడ్ అవుతాయి. సో, బోయపాటి మార్క్ యాక్షన్ ను ఎంజాయ్ చేసేవారికి మాత్రమే పరిమితమైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరిస్తుందో తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే.

టాయిలెట్; ఏక్ ప్రేమ్ కథ : హిందీలో అతి తక్కువ బడ్జెట్ లో అక్షయ్ కుమార్-భూమి పడ్నేకర్ జంటగా రూపొందిన సోషల్ ఎవేర్నెస్ మూవీ “టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ”. పల్లెటూర్లలో టాయిలెట్స్ లేక మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారికి టాయిలెట్స్ అంటే కేవలం అవసరం మాత్రమే కాదు వారి ఆత్మాభిమానానికి నిదర్శనం కూడా. కాన్సెప్ట్ కారణంగా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ను సైతం అందుకొన్న ఈ చిత్రం కాన్సెప్ట్ ప్రస్తుత సమాజానికి అవసరమైనప్పటికీ.. సదరు మెసేజ్ ను సినిమాలో ఎంత ఎంటర్ టైనింగ్ గా, హృద్యంగా చెప్పారు అనేది సినిమా విజయంలో కీలకపాత్ర పోషించనుంది.

సో, సినిమా అభిమానులకి టాక్ తో సంబంధం లేదు కాబట్టి ఎలాగో అన్నీ సినిమాలు చూసేస్తారు. అయితే.. ఈ శుక్రవారం విడుదలవుతున్న అన్నీ సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకొని తెలుగు సినిమా మార్కెట్ ను మరింతగా పెంచాలని “ఫిల్మీ ఫోకస్” మాంస్పూర్తిగా కోరుకొంటూ.. చిత్ర బృందాలకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. మరి ఈ నాలుగు సినిమాల్లో మీరు మొదట ఏ సినిమా చూడాలనుకొంటున్నారు? దానికి కారణం ఏంటో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి! ఈ సినిమాలపై మేము ఇచ్చే జెన్యూన్ రివ్యూల కోసం రేపటివరకూ వెయిట్ చేయండి!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus