‘అత్తారింటికి దారేది’ సినిమా చెన్నై చిన్నది సమంతకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి మధ్య వారధిలా మారింది. ఈ సినిమాతో ఏర్పడ్డ వీరిద్దరి పరిచయం స్నేహంగా మారి ఫెవికాల్ యాడ్ లా అతుక్కుపోయినట్టు తయారైంది. వ్యక్తిగతంగా వారిద్దరి బంధం ఎలా ఉందోగాని సినిమాల్లో మాత్రం అది బాగా కనపడుతోంది. ‘అత్తారింటికి..’ తర్వాత త్రివిక్రమ్ రెండు సినిమాలు చేస్తే ఆ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ సమంతే. ముచ్చటగా మూడు సినిమాలు చేసిన వీరిద్దరూ ఇప్పుడు నాలుగో సినిమా చేయనున్నారట.
‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల తర్వాత త్రివిక్రమ్-పవన్ మూడో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాని నిర్మించనున్నారు. డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతకే ఫిక్స్ అయ్యారట త్రివిక్రమ్ అండ్ టీమ్. ఇప్పటికే దర్శకుడిగా బోలెడంత క్రేజ్ ఉన్న త్రివిక్రమ్ ఇతర నిర్మాతలను పక్కన పెట్టి వరుసగా చినబాబుతోనే సినిమాలు చేస్తున్నారు. ఇక పవన్ కూడా ఒకే దర్శకుడితో మూడేసి సినిమాలు చేసింది లేదు. నిర్మాత, హీరో సరే అనుకుంటే ఈ మధ్యకాలంలో ఓ దర్శకుడు-హీరోయిన్ కలిసి వరుసగా సినిమాలు చేయడం కూడా జరుగలేదు. ఇంకెన్నేళ్ళు ఇదే కాంబినేషన్స్ రిపీట్ అవుతాయో మరి..!