మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో వరుణ్ తేజ్ తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాటితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ ఇటీవల ఆమెని నిశ్చితార్థం చేసుకున్నాడు. జూన్ 9వ తేదీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హాట్ టాపిక్ గా మారారు .
ఇప్పటికే వారికి వారి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయితున్నాయి. లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ వివాహం ఈ ఏడాది చివర్లో జరగబోతుందని వీరి వివాహానికి రాజస్థాన్ లోని ప్యాలెస్ వేదికగా మారబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వరుణ్ తేజ్ ని వివాహం చేసుకోవటానికి లావణ్య త్రిపాఠి భారీ స్థాయిలో కట్న కానుకలు కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్ కట్నం వద్దని చెప్పినా కూడా లావణ్య తల్లిదండ్రులు తమ కూతురి కోసం భారీ స్థాయిలో కట్నం ఇవ్వటానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా వీరి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని వివాహం చేసుకొని మెగా ఇంటికోడలుగా అడుగుపెట్టడానికి వరుణ్ తేజ్ కి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
మెగా కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి అందరికీ తెలిసిందే. అందువల్ల కుటుంబ గౌరవానికి ఇబ్బంది కలగకుండా తాను వివాహం తర్వాత సినిమాలలో నటించనని, వివాహం తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెడతానని లావణ్య కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనకు ఇష్టమైన భరతనాట్యం కోసం స్టేజి షోలు చేస్తానని కూడా కండిషన్ పెట్టింది. అయితే లావణ్య పెట్టిన కండిషన్స్ కి వరుణ్ తేజ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.