Ram Charan, Upasana: ఆ కారణంతోనే చిరు ఇంటికి వెళ్తున్న ఉపాసన దంపతులు… గ్రేట్ అంటూ?

మెగా కోడలు ఉపాసన త్వరలోనే తల్లిగా ప్రమోట్ కానున్నారు.పెళ్లయిన 10 సంవత్సరాలకు ఈమె తల్లి కాబోతున్నాను అంటూ ఒక గుడ్ న్యూస్ అందరితో షేర్ చేసుకున్నారు. ఇలా ఈ శుభవార్తను తెలియజేయడంతో మెగా వారసుడి కోసం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఉపాసన ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న సంగతి తెలిసిందే మరి కొద్ది రోజులలో ఈమె తల్లి కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన తన ప్రెగ్నెన్సీ విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిన రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన తాము తిరిగి తమ అత్తయ్య మామయ్య ఇంటికి వెళ్తున్నామంటూ తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ త్వరలోనే తిరిగి తాము అత్తయ్య మామయ్య దగ్గరకు వెళ్తున్నామని తెలియజేశారు. అలా వారి దగ్గరకు వెళ్లడానికి కారణాన్ని కూడా ఉపాసన వివరించారు.

నేను రామ్ చరణ్ (Ram Charan) నేడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అందుకు గల కారణం మా గ్రాండ్ పేరెంట్స్ మాకు పంచిన ప్రేమ వల్లే. అలాంటి ప్రేమ నా బిడ్డకు కూడా దక్కాలి.అందుకే తిరిగి తాను అత్తయ్య మామయ్యలతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు. పిల్లలు ఎప్పుడైతే గ్రాండ్ పేరెంట్స్ వద్ద పెరిగి పెద్దవుతారో వారిలో చాలా ఉన్నతమైన లక్షణాలు ఉంటాయి.

అందుకే తాము కూడా ఈ నిర్ణయం తీసుకుని తిరిగి అత్తయ్య మామయ్య దగ్గరకు వెళ్తున్నామంటూ ఈమె చెప్పడంతో ఉపాసన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో గొప్పదని,మెగా కోడలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచిస్తారు అంటూ అభిమానులు ఈమెపై, వీరు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus