హీరోయిన్ కాబోతున్న నవ్వించే పిల్ల

చిన్నప్పుడే కోమలి సిస్టర్స్ వేదికపై దైర్యంగా జోక్స్ పేల్చారు. అందరినీ అనుకరిస్తూ నవ్వించారు. టీవీ ఛానల్స్ లో వీజే గా మెప్పించారు. అందులో పెద్దమ్మాయి పేరు హిరోషిని, చిన్నమ్మాయి దేవర్షిని. వీరిద్దరూ కొంతకాలంగా ఏ మీడియాలో కనిపించడం లేదు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటి స్టడీ అయితే. రెండోది హీరోయిన్ అవ్వాలనే కల. హిరోషిని అందుకు తగ్గ ప్రిపేరేషన్ లోనే ఉంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. “కొత్త హిరోషినిగా మీకు దగ్గరి కావాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా మిమిక్రీ షోలకు దూరంగా ఉన్నాను. ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశాను.

థియేటర్‌ వర్క్‌షాప్‌లో సత్యానంద్‌ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నాను. కొద్దిపాటి ప్రతిభ, అనుభవం ఉన్నా… డ్యాన్సర్‌గా, ఆర్టిస్ట్‌గా అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని వెండితెరకు రావాలన్నదే నా ఆలోచన. అలాగే జిమ్, ఆహారం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నా. కునాల్‌ గిర్‌ స్టీల్‌ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్నాను” అని వివరించింది. అంతేకాదు రీసెంట్ గా ఆమె ఫోటోలు నెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలను చూస్తుంటే ఆమె కృషి అర్ధమవుతోంది. నేటి హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా సిద్ధమవుతోంది. మరి మంచి పాత్ర దొరికితే తానేంటో నిరూపించుకోవడానికి ఆశపడుతోంది. గురూజీ త్రివిక్రమ్‌ చిత్రం “అ ఆ” సినిమాలో మెరిసిన ఈ అమ్మాయిని హీరోయిన్ గా ఏ డైరక్టర్ పరిచయం చేస్తారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus